కార్తీకదీపంలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న వంటలక్క డాక్టర్ బాబు..?

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సీరియల్స్ ద్వారా దీప కార్తీక్ పాత్రలలో ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ ఎంతో అద్భుతంగా నటించి విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.

 Doctor Babu Vantalakka Re Entry In Karthika Deepam Serial Details,  Karthika Dee-TeluguStop.com

అయితే ఒక రోడ్ యాక్సిడెంట్ సన్నివేశంలో దీప కార్తిక్ ఇద్దరు చనిపోయినట్టు చూపించారు.ఇక వీరిద్దరి పాత్రలను సీరియల్ నుంచి తొలగించడంతో ఎంతోమంది అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.

చిన్నప్పటి హిమ సౌర్య పెద్ద అయి ప్రస్తుతం వీరితో కథ మొత్తం నడిపిస్తున్నారు.ఇక దీప కార్తీక్ లేకపోవడంతో చాలా మంది సీరియల్ చూడటానికి ఇష్టపడటం లేదు.

ఇకపోతే తాజా సమాచారం ప్రకారం సీరియల్ లో కి దీప కార్తీక్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.కార్తీక్ దీప లోయలో పడి ఆ ప్రమాదంలో చనిపోలేదని ఆ ప్రమాదం నుంచి బయటపడి వీరిద్దరూ మానసిక స్థితి కోల్పోయి ఉంటారట.

మంగళూరు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఉంటారట,అయితే త్వరలోనే వీరిద్దరూ వారి పిల్లలను కలుసుకోబోతున్నారు తెలుస్తోంది.జ్వాల దగ్గర ఉన్న చంద్రమ్మ, ఇంద్రుడు ఓ పని నిమిత్తం సొంత ఊరికి వెళ్లగా అక్కడ వీరికి దీప కార్తీక్ తారసపడతారు.

Telugu Chandrudu, Deepa, Babu, Hima, Indrudu, Karthik, Karthika Deepam, Karthika

ఇలా చంద్రమ్మ ఇంద్రుడు వీరిని చూడగా కథ మొత్తం అడ్డం తిరిగి చివరికి వారి సహాయంతో దీప కార్తీక్ తమ సొంత ఇంటికి చేరుకుంటారు.ఇక పోతే ఇదే సమయంలోనే మోనిత కూడా రీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.ప్రస్తుతం మోనిత కొడుకు ఆనంద్ ఇప్పటికే హిమ దగ్గర ఉన్నారు.ఇక మోనిత కూడా ఆనంద్ కోసం, డాక్టర్ బాబు కోసం ఆ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చి యధావిధిగా కార్తీకదీపను విడగొట్టడానికి ప్రయత్నం చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

మరి నిజంగానే కార్తీకదీపం సీరియల్ లోకి దీప కార్తీక్ రీ ఎంట్రీ ఇస్తే రేటింగ్స్ అమాంతం పెరిగిపోతాయని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube