మళ్ళీ వారి ప్రేమకథ చెప్పిన డాక్టర్ బాబు, మంజుల.. నెట్టింట్లో వైరల్?

నిరుపమ్ పరిటాల తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.తెలుగు బుల్లితెర పై తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్న నటుడు నిరుపమ్ పరిటాల.

 Dr Babu And Manjula Tell Their Love Story Viral On Social Media Details,  Dr Bab-TeluguStop.com

చంద్రముఖి, మూగ మనసులు, కాంచన గంగ వంటి సీరియల్స్ లో తనదైన శైలిలో నటించి ఎంత మంది ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు.నిరుపమ్ పరిటాల భార్య మంజులకు కూడా బుల్లితెర మంచి పాపులారిటీ ఉంది.

ఇది ఇలా ఉంటే ఇటీవలే ఈ జంట ఒక సొంత యూట్యూబ్ చానల్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.వీటి ద్వారా తమకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా తన అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా ఈ ఇద్దరూ తమ యూట్యూబ్ చానెల్‌లో వారి ప్రేమ కథను వివరించారు.ఈ ఇద్దరూ కలిసి చంద్రముఖి సీరియల్‌లో మొదటిసారిగా నటించారు.అక్కడే వీరి ప్రేమకు నాంది పలికినట్టు అయింది.చంద్రముఖి సీరియల్ ద్వారా ప్రేమ కథ మొదలైందని మంజుల, నిరుపమ్ చెప్పుకొచ్చారు.

ఈ రోజు నిరుపమ్ ప్రపోజ్ చేసిన రోజంటూ మంజుల ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది.

ప్రపోజల్ డే సందర్భంగా అంటూ తన యూట్యూబ్ చానెల్‌లో ఓ వీడియోను వదిలింది.

ఇందులో నిరుపమ్ మంజుల కలిసి ఎన్నో విషయాలను బయటపెట్టేశారు.చంద్రముఖి సీరియల్ మంజులకు తెలుగులో మొదటి సినిమా ఫస్ట్ టైం చూసి హీరోయిన్ బాగుందని అనుకున్నానంటూ నిరుపమ్ తెలిపాడు.ఇప్పుడంటే అందరూ చాలా ఫాస్ట్ కలిసిన వెంటనే ఫోన్ నంబర్లు ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నారు.కానీ మాకు మాత్రం అలా కాదు.ఫోన్ నంబర్లు తీసుకునేందుకు మాకు ఏడాది పట్టింది.పరిచయమైన ఏడాదికి మేం ఫోన్ నంబర్లు తీసుకున్నాం అలా ఫోన్‌లు, చాటింగ్‌లతో రోజంతా గడిపేవాళ్లం.

సెట్‌లో ఎప్పుడూ మాట్లాడుకునే వాళ్లం కాదు.ఏమున్నా కూడా ఫోన్‌లోనే మాట్లాడుకునే వాళ్లమని అని మంజుల తెలిపింది.

అయితే ఇలా ఫోన్‌లు ఎక్కువగా మాట్లాడుతుండటంతో ఇంట్లో అనుమానం వచ్చింది.చెల్లి కీర్తికి మా మ్యాటర్ తెలుసు, అలా అమ్మకు చెప్పాను,తర్వాత నాన్నకు చెప్పేశాను.నిరుపమ్ గురించి అందరికీ తెలుసు కాబట్టి మా ఇంట్లో ఏమీ అనలేదు అని మంజుల చెప్పుకొచ్చింది.మా ఇంట్లోనూ అంతే నా చాయిస్, సెలక్షన్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇంట్లో ఏమీ అభ్యంతరం చెప్పలేదు అని నిరుపమ్ అన్నాడు.

నిరుపమ్ ఇంట్లో ఏమీ అనలేదు కానీ జాతకాలు కలిస్తేనే పెళ్లి అన్నారు.లక్కీగా జాతకాలు కలవడంతో పెళ్లైంది.

చంద్రముఖి యూనిట్‌కు మా వెడ్డింగ్ కార్డ్ ఇస్తుంటే అంతా షాక్ అయ్యారు.ఇదంతా ఎప్పుడు జరిగిందంటూ ఆశ్చర్యపోయారు.

అలా అంత సైలెంట్‌గా మేం ప్రేమించుకున్నామని మంజుల చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube