డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వారం రోజులుగా వరద ముంపులోనే పడవల పైనే ప్రయాణం..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వారం రోజులుగా వరద ముంపులోనే పడవల పైనే ప్రయాణం చేస్తూ ఇంటి అరుగులు పైదాకా వరద నీరు చేరి వంట చేసుకోవడానికి పుల్లలు లేక కనీసం త్రాగడానికి మంచినీళ్లు లేక నిత్యం వరద నీటిలోనే అవస్థలు పడుతున్న సంఘటన రోజు చూస్తూనే ఉన్నాం.

 Dr. B.r. Ambedkar Konaseema District Traveled On Boats For A Week Under Flood ,-TeluguStop.com

నేడు 75 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు దేశమంతా వేడుకగా జరుపుకుంటున్న సమయంలో లంక గ్రామాల్లో స్కూళ్లు 100 శాతం వరద నీటిలో మునిగిపోయాయి.ఏదో విధంగా మా స్కూల్లో జెండా ఎగరేసి స్వతంత్ర దినోత్సవ జరుపుకోవాలని సంకల్పంతో స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్తులు కలిపి పడవలపై జెండాలతో ఊరేగింపుగా వెళ్లి గుండెల్లోతూ నీళ్ళలో జెండా ఎగరేసి, దేశభక్తి గీతాలు వరదనీటిలోనే ఆలపించి అకుంఠిత దీక్షతో దేశభక్తిని చాటుకున్న వైనం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పన్న రాముని లంకలో చోటుచేసుకుంది.వరదలు సైతం లెక్కచేయకుండా ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు ప్రాణాలకు తెగించి వీరు చేసిన సాహసాన్ని, దేశం పై ఉన్న భక్తిని పలువురు ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube