మృత్యు హైవే : 50 ఏళ్లుగా ఆ రోడ్డు మీద ఆడవారు మిస్‌ అవుతున్నారు.. శవాలు కూడా కనిపించవు  

  • అభివృద్దికి ఆనవాళ్లు రోడ్లనుగా చెప్పుకుంటారు. రోడ్లు పడ్డ గ్రామాలు మరియు పట్టణాలు మాత్రమే అభివృద్దిలో దూసుకు పోతాయి. అందుకే ఒక ప్రాంత అభివృద్ది చూడాలి అంటే ఆ ప్రాంతంలోని రోడ్లను చూడాలి అని అంటూ ఉంటారు. అంటే రోడ్లు బాగుంటేనే అభివృద్ది బాగుందని అర్థం. పెరిగిన అవసరాలు మరియు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రోడ్ల విస్తరణ అత్యంత వేగంగా జరుగుతుంది. రోడ్ల గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని రోడ్లు మృత్యు ఘంటికలు అంటారు. అంటే ఆ రోడ్డుపై ప్రతి రోజు ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో ప్రమాధం జరుగుతూనే ఉంటుంది. అయితే బ్రిటీష్‌ కొలంబియాలో మాత్రం ఒక రోడ్డు అత్యంత విచిత్రంగా ఉంది.

  • బ్రిటీష్‌ కొలంబియాలోని ఒక హైవేలో 1969 నుండి మహిళలు, అమ్మాయిలు మిస్‌ అవుతున్నారు. దాదాపు 50 ఏళ్లుగా ఎంతో మంది ఆడవారు ఆ హైవేపై ప్రయాణిస్తూ లేదా ఆ హైవేకి ఎక్కడం వల్ల కనిపించకుండా పోయారు. ఆ హైవేకు పక్కన దాదాపుగా 20 చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల వారు దూర ప్రాంతాలకు వెళ్లాలి అంటే ప్రైవేట్‌ వెయికిల్స్‌ను ఆశ్రయించాల్సిందే.

  • Dozens Of Women Vanish On Canada Highway Tears-Dozens Tears

    Dozens Of Women Vanish On Canada Highway Of Tears

  • అక్కడి వారిలో ఎక్కువగా వాహనాలు ఉండక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ హైవే పక్కన ఉన్న గ్రామాల వారు రోడ్డు మీదకు వచ్చి ఏదో ఒక వాహనం ను లిఫ్ట్‌ అడిగి వెళ్తూ ఉంటారు. అలా లిఫ్ట్‌ అడిగి వెళ్లిన వారిలో ఎక్కువ శాతం మళ్లీ కనిపించలేదు. అందుకే ఈ హైవే కు హైవే ఆఫ్ టియర్స్ అనే పేరు పెట్టారు.ఆ హైవేపై జన సంచారం చాలా చాలా తక్కువగా ఉంటుంది. అసలు జనాలు కనిపించరు. అప్పుడప్పుడు మాత్రమే జనాలు వెయికిల్స్‌పై ప్రయాణిస్తూ ఉంటారు. వెయికిల్స్‌ చాలా తక్కువగా ఉంటాయి కనుక జనాలు ఆ వెయికిల్స్‌పై ప్రయాణించే సమయంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

  • Dozens Of Women Vanish On Canada Highway Tears-Dozens Tears
  • ఎవరి చేత అయినా హత్య చేయబడితే కనీసం శవాలు అయినా దొరకాలి కదా ఎలా ఆడవారు మిస్‌ అవుతున్నారు అంటూ పోలీసులు కూడా జుట్టు పీక్కుంటున్నారు. కేవలం ఆడవారు మాత్రమే అపహరణకు గురవుతున్న నేపథ్యంలో ఆడవారు ఆ హైవేపై ఒంటరిగా వెళ్లడం, లేదంటే అపరిచితుల వాహనాలను ఎక్కడం ప్రమాధకరం అంటూ పోలీసు వారు బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా కూడా ఈమద్య కూడా ఒక మహిళ మిస్‌ అయ్యింది. ఆమె జాడ కూడా ఇంకా కనిపించలేదు. ఇంతకు ఆ హైవేపై ఏం ఉందో అని ఎంతో మంది ఆసక్తి చూపుతూ ప్రయాణిస్తున్నారు.