మధ్యధరా సముద్రంలో మునిగిన బోటు....65 మంది మృతి!

శరణార్ధుల తో ప్రయాణిస్తున్న బోటు ఒకటి మునిగిపోయిన ఘటన మధ్యధరా సముద్రంలో చోటు చేసుకుంది.యూరప్ చేరుకోవటం కోసం బోటులో ప్రయాణిస్తున్న శరణార్థులు ఒక్కసారిగా నీటమునిగినట్లు తెలుస్తుంది.

 Dozens Drown As Migrant Boat Capsizes Off Tunisia-TeluguStop.com

ట్యునీసియా సమీపంలో వీరి బోటు మునిగిపోయిందని 65 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో వెల్లడించింది.అయితే ఈ ప్రమాదం నుంచి కేవలం 16 మందిని కాపాడినట్లు చెప్పింది.

లిబియాలోని జువారా నుంచి గురువారం బయలు దేరిన బోటు మధ్యధరా సముద్రంలో మునిగిపోయినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు చెబుతున్న్నారు.బలమైన అలల కారణంగా వారు ప్రయాణించిన బోటు మునిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

అయితే లిబియా నుంచి యూరప్ వెళ్లే మధ్యధరాసముద్ర మార్గంలో 2019 మొదటి నాలుగు నెలల్లో 164 మంది చనిపోయినట్లు యూఎన్ హెచ్ సి ఆర్ లెక్కలు చెప్తున్నాయి.

తాజా ప్రమాదం ఈ ఏడాది శరణార్థులకు సంబంధించి అతి పెద్ద ప్రమాదంగా మారినట్లు తెలుస్తుంది.

ప్రమాదం నుంచి కాపాడిన వారిని ట్యునీసియా నౌకాదళం దేశ తీరానికి తీసుకువచ్చింది.నౌక నుంచి ట్యునీసియాలోకి అడుగుపెట్టేందుకు వీరు వేచివున్నారు.ప్రతి ఏటా వేలాది మంది శరణార్థులు యూరప్ చేరుకోవటం కోసం మధ్యధరా సముద్రాన్ని దాటటానికి ప్రయత్నిస్తున్నారు.ఆ ప్రాణాంతక ప్రయాణం ప్రారంభించటానికి లిబియా ఒక కీలక కేంద్రంగా మారింది.

ఈ ప్రయాణంలో పాతబడిపోయిన పడవల్లో, ప్రయాణికులను పెద్ద సంఖ్యలో ఇరికించి పంపిస్తున్నారు.ఫలితంగా చాలా మంది చనిపోతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube