బిగ్‌బాస్‌ ఓటింగ్‌పై అనుమానాలు.. అసలేం జరుగుతుంది?  

  • తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 నుండి నిన్న భానుశ్రీ ఎలిమినేట్‌ అయ్యింది. గణేష్‌ మరియు టీవీ9 దీప్తిలతో పాటు భానుశ్రీ నామినేషన్‌లో ఉన్న విషయం తెల్సిందే. ఈ ముగ్గురిలో అతి తక్కువ క్రేజ్‌ ఉన్న ఇంటి సభ్యులు గణేష్‌ ఖచ్చితంగా ఎలిమినేట్‌ అవుతాడు అని అంతా భావించారు. కాని అనూహ్యంగా వచ్చిన ఆరు కోట్ల ఓట్లలో భానుశ్రీకి తక్కువ పడ్డట్లుగా నాని ప్రకటించి, భానును ఎలిమినేట్‌ అయినట్లుగా ప్రకటించాడు. మొదటి నుండి కూడా బిగ్‌బాస్‌ ఓటింగ్‌పై పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతూనే వస్తున్నాయి. ఈసారి కూడా మళ్లీ బిగ్‌బాస్‌ ఓటింగ్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  • బిగ్‌బాస్‌ సీజన్‌ 1లో పు సందర్బాల్లో ఓటింగ్‌పై అనుమానాలు ఉన్నాయి అంటూ సోషల్‌ మీడియాలో కొందరు వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ సారి కూడా బిగ్‌బాస్‌ నుండి ఎలిమినేట్‌ అవుతున్న వారిని చూస్తుంటే ఖచ్చితంగా ఓటింగ్‌లో ఏదో మతలబు జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా గణేష్‌కు అత్యధికంగా ఓటింగ్‌ నమోదు అవ్వడంతో ఆ అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. బిగ్‌బాస్‌లో ఓటింగ్‌ విషయంలో అసలేం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  • Doubts Raised On Big Boss 2 Telugu Voting-

    Doubts Raised On Big Boss 2 Telugu Voting

  • ఖచ్చితంగా భానుశ్రీ, టీవీ9 దీప్తిలు ప్రేక్షకుల్లో క్రేజ్‌ కలిగి ఉన్నారు. వీరిద్దరి యాక్టివిటీస్‌ బాగున్నాయి. గణేష్‌తో పోల్చితే వీరిద్దరు బలమైన కంటెస్టెంట్స్‌ అంటూ అంతా బలంగా నమ్ముతున్నారు. ప్రేక్షకులు కూడా అదే విషయాన్ని ఓటింగ్‌లో చెప్పారని, కాకుంటే బిగ్‌బాస్‌ నిర్వాహకులు మాత్రం తమకు తోచిన విధంగా ఓటింగ్‌ను నిర్వహిస్తున్నారు అంటూ ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. బిగ్‌బాస్‌కు ప్రేక్షకులు వేసిన ఓట్లను పరిగణలోకి తీసుకోకుండా, ముందే వారు నిర్ణయించుకున్న దాని ప్రకారంగా భానుశ్రీను ఎలిమినేట్‌ చేసేశారు.

  • గత వారంలో కూడా చాలా బలమైన కంటెస్టెంట్‌ అయిన శ్యామల ఎలిమినేట్‌ అవ్వడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. ఆమెను బయటకు పంపించాలనే ఉద్దేశ్యంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఆమెకు తక్కువ ఓటింగ్‌ వచ్చిందని ప్రకటించారు. మొత్తానికి బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో ఎలిమినేషన్స్‌ ప్రేక్షకుల ప్రమేయం లేకుండా జరుగుతున్నాయనే ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. షో నిర్వాహకులు ఎవరో ఒకరిని ఫిక్స్‌ అయిన తర్వాత ప్రేక్షకులను మళ్లీ ఓట్లు అడగడం ఎందుకు అంటూ విమర్శలు వస్తున్నాయి. బిగ్‌బాస్‌ మదిలో ఈ వారం ఎవరు ఉన్నారో చూడాలి.