జనసేన టీడీపీ బంధంపై పెరిగిపోతున్న అనుమానాలు !

కొత్త రాజకీయం చేద్దామన్న ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాను, సాంప్రదాయ రాజకీయాలకు నేను విరుద్ధం అంటూ చెప్పుకుంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదట్లో కొత్త తరహా రాజకీయాలు చేసినట్టుగానే కనిపించినా పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేకొద్ది పవన్ రాజకీయాలపై అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి.టీడీపీ కి మద్దతుగా ఆయన రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి.

 Doubts On Relation Between Janasena And Tdp 2-TeluguStop.com

దీనికి తగ్గట్టుగానే పవన్ కూడా వైసీపీ మీదే విమర్శలు చేస్తున్నాడు తప్ప టీడీపీ జోలికి వెళ్లే సాహసం చేయడంలేదు.పవన్ ఎదుర్కుంటున్న ఇంకో ఆరోపణ ఏంటి అంటే ? టీడీపీ కీలక నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో జనసేన తరుపున బలహీనమైన అభ్యర్థులను పోటీకి దింపారనే విమర్శలు కూడా పవన్ మీద ఎక్కువగా వస్తున్నాయి.

చంద్రబాబు వ్యూహాలకు అనుగుణంగానే కొంతమంది నాయకులు జనసేనలోకి వెళ్ళడం, వారిలో కొంతమంది ప్రచారం విషయంలో టీడీపీకి సహకరిస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు మాటలు అందరిలోనూ అనుమానాలు పెంచాయి.

ఎంపీ ఎస్పీవై రెడ్డిని టీడీపీలోకి రావాల్సిందిగా కోరారు.బహిరంగ సభలోనే చంద్రబాబు ఎస్పీవై రెడ్డి, చంద్రబాబు మీద అలిగి జనసేనలో చేరి, ఏకంగా తన కుటుంబం నుంచి నలుగురికి టిక్కెట్లు ఇప్పించుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

వాస్తవానికి ఎస్పీవై రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు.ఎన్నికలు జరిగిన వెంటనే పార్టీ మారిపోయారు.

ఇప్పుడు ఆయన జనసేన నుంచి మళ్లీ టీడీపీకి వెళ్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఎస్పీవై రెడ్డి తరహాలో మరోకొంతమంది నాయకులను టీడీపీ బహిరంగంగానే పిలుస్తున్న పవన్ మాత్రం ఎక్కడా నోరు మెదపడంలేదు.ఈ విషయంలో పవన్ పై సొంత పార్టీలోనే అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.పవన్ స్థానంలో ఎవరున్నా ఈ విషయంలో గట్టిగానే తమ స్పందన తెలియజేసి టీడీపీ చేస్తుంది దుర్మార్గం అంటూ గగ్గోలుపెట్టేవారు.

కానీ పవన్ సైలెంట్ అవ్వడం ఎవరికీ అంతుపట్టడంలేదు.ఇది కుమ్మక్కు రాజకీయం అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఇది మరింత బలం చేకూరుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube