పవన్‌, దాసరి మూవీకి సంవత్సరం

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా దాసరి నారాయణ రావు నిర్మాణంలో ఒక సినిమా రాబోతుందనే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.ఆ ప్రకటన వచ్చి సంవత్సరం పూర్తి అయ్యింది.

 Doubts On Pawan And Dasari Movie-TeluguStop.com

దాసరి ఈ చిత్రం గురించి ప్రకటన చేసి సంవత్సరం అయినా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.ఈ చిత్రం కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని చెబుతున్నారు, కాని ఇప్పటి వరకు అందుకు సంబంధించిన కార్యక్రమాలు మొదలైనట్లుగా సమాచారం లేదు.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం విడుదల తర్వాత ఈ సినిమా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.అందుకోసం దాసరి కథ మరియు దర్శకుడిని సిద్దం చేస్తున్నాడని అంటున్నారు.

కాని కొందరు మాత్రం ఈ సినిమా ఉండేది అనుమానమే అని, దాసరి నిర్మాణంలో పవన్‌ సినిమా వస్తుందని తాము అనుకోవడం లేదు అని మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే వారు అంటున్నారు.ఈ సంవత్సర ప్రకటన వచ్చి సంవత్సరం అయిన సందర్బంగా దాసరి ఏమైనా ప్రకటన చేస్తాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube