బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా ... లేదా అని సందేహపడుతున్నారా?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని రకాల మొక్కలను వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము.ఈ క్రమంలోనే అలాంటి దైవ సమానమైన మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల శుభప్రదం అని పండితులు చెబుతుంటారు.

 Doubt To Put Bilwa Tree In Houses Or Not , Bilwa Tree , Houses , Worship , Hind-TeluguStop.com

అయితే చాలా మందికి కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతుంటాయి.ఇలాంటి వాటిలో శివునికి ఎంతో ప్రీతికరమైన బిల్వ వృక్షం ఇంటిలో పెట్టుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది.

మరి శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ చెట్టు ఇంట్లో ఉండవచ్చా లేదా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పరమ శివుడికి ప్రీతికరమైన వాటిలో బిల్వ పత్రాలు ఒకటి.

బిల్వ పత్రాలతో పరమశివుడికి పూజ చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు.ఇలా మూడు పత్రాలు కలిగిన ఈ బిల్వదళం శక్తి, జ్ఞానశక్తి, క్రియా శక్తికి ఇది నిదర్శనం.

ఎంతో పవిత్రమైన ఈ బిల్వదళాలతో శివుడికి అర్చన చేయడం వల్ల వేలాది మందికి అన్నదానం చేసిన పుణ్య ఫలం దక్కుతుంది.అదే విధంగా ఎన్నో పుణ్య నదులలో స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యఫలం కూడా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

Telugu Bilwa Tree, Hindu Belive, Hindu, Houses, Lord Siva, Worship-Latest News -

ఈ బిల్వదళాలతో పరమేశ్వరుడికి అర్చన చేయటంవల్ల 108 శైవ క్షేత్రాలను దర్శించిన పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతారు.ఇలా ఎంతో పవిత్రమైన ఈ బిల్వ వృక్షాన్ని ఇంటి ఆవరణంలో పెంచుకోవడం ఎంతో శుభసూచకం.ఈ బిల్వ వృక్షం నుంచి వచ్చే గాలిని పీల్చడం లేదా ఆ బిల్వ వృక్షం నీడ మనపై పడేలా ఉండటం వల్ల అధిక శక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.ఇక ఎవరైతే బిల్వ వృక్షానికి పూజలు చేసి పూజిస్తారో అలాంటి వారికి సకల సంపదలు కలుగుతాయని ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని పండితులు.

అయితే బిల్వ దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు.తులసితో సమానంగా బిల్వ వృక్షాన్ని కూడా పవిత్రంగా భావించి పూజించడం వల్ల శివయ్య అనుగ్రహం మనపై ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube