ఒక్కటైనా ఒంటరే ... మసకబారుతున్న మహాకూటమి  

  • తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా ఏర్పడిన మాహాకూటమి రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టు వేస్తోంది. మహాకూటమిగా ఏర్పడి పార్టీలన్నీ ఒక్కచోటికి చేరాయన్న మాటే కానీ ఒక పార్టీతో మరో పార్టీకి సంబంధమే లేదన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. కూటమిలో అతిపెద్ద సమస్య సీట్ల సర్దుబాటు ఒకటయితే… రెండో సమస్య మ్యానిఫెస్టో. కూటమిలో ఉన్న పార్టీలు ఎవరికి వారు సొంతంగా మ్యానిఫెస్టో తయారుచేసుకుంటున్నారు తప్ప ఉమ్మడిగా… ఒక మేనిఫెస్టో తయారుచేసుకునే ఆలోచనలో ఎవరూ లేరు. ఇంకా చెప్పాలంటే పేరుకే కూటమి ఎవరి దారి వారిదే అనే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది.

  • Doubs Raising On Mahakutami-

    Doubs Raising On Mahakutami

  • కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉత్సాహంగా ఉన్నాయి. వీళ్లు మాత్రమే కలిసి ఎన్నికలకు వెళ్లాలని అనుకోవడం లేదు. తమకు తోడుగా కమ్యూనిస్టులు, కోదండరాం కూడా తోడు అయితే బాగుంటుందని అనుకున్నారు. ఈ మేరకు వాళ్లను కూడా చర్చలకు పిలిచారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినన్ని సీట్లకు తెలుగుదేశం ఓకే అంటోంది. ఎన్ని సీట్లు ఇచ్చినా తమకు ఓకే అన్నట్టుగా ఉంది టీడీపీ. ఇక కమ్యూనిస్టులదీ అదే పరిస్థితి. అయితే కోదండరాం మాత్రం సీట్ల విషయంలో పట్టుబడుతున్నాడని తెలుస్తోంది. తను కోరినన్ని సీట్లు ఇవ్వాల్సిందే లేకపోతే తన దారి తనదే అన్నట్టు కోదండరాం వ్యవహరిస్తున్నాడు.

  • Doubs Raising On Mahakutami-
  • ఆఖరికి బీజేపీతో చేతులు కలపడానికి వెనుకాడేది లేదని కోదండరాం మహాకూటమిలోని పార్టీలకు సంకేతాలు పంపుతున్నాడు. అయితే కోదండరాం ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలుతాయని, బీజేపీతో చేతులు కలిపితే ఆ పార్టీకి ప్లస్ అవుతుందని కాంగ్రెస్, టీడీపీలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారపర్వంలో దూసుకుపోతుంటే మహాకూటమిలో ఉన్న పార్టీలు మాత్రం ఇంకా పేచీలు దగ్గరే ఆగిపోతున్నాయి. కూటమి అంటే అందులోని పార్టీలు ఐక్యంగా ప్రతి అడుగు వేయాలి. ఐక్యంగానే ప్రజలకు మాట ఇవ్వాలి. అలాంటి లక్షణాలేమీ ఈ మహా కూటమిలో ఉన్న పార్టీలకు కనిపించడం లేదు. ఇలా అయితే కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారో ? కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎలా ముందుకు నడిపిస్తారో అనే సందేహం ప్రజలందరిలోనూ కనిపిస్తోంది.