ఈవారం డబుల్‌ ఎలిమినేషన్‌.. మళ్లీ ప్రేమ పక్షికి ఊరట  

this week double elimination from telugu bigg boss 4, bigg boss4, nagarjuna, double elimination, mehaboob, amma rajasekhar, nagarjuna, bigg boss nominations, monal saved, love track - Telugu Amma Rajasekhar, Bigg Boss Nominations, Bigg Boss4, Double Elimination, Love Track, Mehaboob, Monal Saved, Nagarjuna, This Week Double Elimination From Telugu Bigg Boss 4

తెలుగు బిగ్‌బాస్ ‌లో ప్రతి వారం ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేక పోతున్నారు.ఎందుకంటే ఓట్ల ప్రకారం కాకుండా ఎలిమినేషన్‌ జరుగుతుంది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

TeluguStop.com - Double Elimination From Telugu Bigg Boss 4

సగం రోజులు పూర్తి అయ్యాయి.ఎనిమిదవ వారం షో సాగుతుంది.

ఇలాంటి సమయంలో బిగ్‌ బాస్‌లో ఇంకా 11 మంది ఉన్నారు.ఈ పదకొండు మందిలో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్‌ అయితే లెక్క ఫైనల్‌ వారంకు సరిపోతుందనే అభిప్రాయంతో నిర్వాహకులు ఉన్నారు.

TeluguStop.com - ఈవారం డబుల్‌ ఎలిమినేషన్‌.. మళ్లీ ప్రేమ పక్షికి ఊరట-General-Telugu-Telugu Tollywood Photo Image

ఫైనల్‌ వారంకు అయిదుగురు ఉండాలి.అంటే షో లో ఈ వారం లేదా తర్వాత వారం లో ఇద్దరు ఒకేసారి ఎలిమినేట్‌ అవ్వాల్సి ఉంది.

ఆ విషయమై ఇప్పటికే నిర్వాహకులు ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం అందుతోంది.ఈ వారంలో ఇద్దరు వీక్‌ కంటెస్టెంట్స్‌ అయిన మెహబూబ్‌ మరియు అమ్మ రాజశేఖర్‌లను ఎలిమినేట్‌ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ వారం మొత్తం ఆరుగురు ఎలిమినేట్‌కు నామినేట్‌ అయ్యారు.అందులో అఖిల్‌, లాస్య మరియు అరియానాలు ఈజీగా సేవ్‌ అవ్వగా మోనాల్‌ ప్రేమ పక్షి అవ్వడంతో పాటు ఆమె వల్ల ఎంతో కొంత ఫుటేజ్‌ వస్తుంది.

కనుక ఆమెను ఎలిమినేట్‌ చేయకూడదు అనే అభిప్రాయంలో నిర్వాహకులు ఉన్నారు.మోనాల్‌ కు గత రెండు మూడు వారాలుగా వ్యతిరేకత ఎక్కవ వచ్చింది.షో నిర్వాహకులు ఆమెకు తక్కువ ఓట్లు వచ్చినా కూడా సేవ్‌ చేస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.అయినా కూడా ఈసారి ఆమెను మళ్లీ సేవ్‌ చేస్తున్నారు.

మొత్తానికి ఈ వారంలో డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని అమ్మ రాజశేఖర్‌ మరియు మెహబూబ్‌ లు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.ఒక వేళ నోయల్‌ కనుక రీ ఎంట్రీ ఇస్తే ఇద్దరు ఎలిమినేట్‌ అవ్వడం ఖాయం.

ఒక వేళ నోయల్‌ ఆరోగ్యం కుదుట పడకుంటే ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్‌ అవుతారు అంటూ షో విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Amma Rajasekhar #Monal Saved #Love Track #Nagarjuna #Bigg Boss4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Double Elimination From Telugu Bigg Boss 4 Related Telugu News,Photos/Pics,Images..