భోజనం చేసేటప్పుడు ఈ పనులు చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

ప్రస్తుతం జీవన విధానంలో భోజనం చేయడానికి కొందరికి సమయం దొరకడం లేదు.అయితే ఏం చేసినా, ఎంత చేసినా, పిడికెడు పొట్ట కోసమే కాబట్టి భోజనం చేసేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు అని చెప్తున్నారు.

 Dos And Donts While Eating Food Rituals-TeluguStop.com

అలా కాదని కొన్ని పనులు చేస్తే పరబ్రహ్మ స్వరూపమైన ఆహారాన్ని అవహేళన చేసినట్లే అని పండితులు చెబుతున్నారు.మరి ఇక్కడ భోజనం చేసేటప్పుడు చేయవలసిన, చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం.

భోజనం చేసేటప్పుడు భోజనంను, భోజనం పెట్టిన వారిని దూషించ కూడదు.ఏడుస్తూ భోజనం చేయకూడదు.పాత్రలోని, పళ్లెంలోని మొత్తం అన్నాన్ని ఖాళీ చేయకూడదు.అన్నం తినేటప్పుడు పళ్లెంని ఒడిలో పెట్టుకొని తినరాదు.

 Dos And Donts While Eating Food Rituals-భోజనం చేసేటప్పుడు ఈ పనులు చేస్తున్నారా అయితే ఇది తెలుసుకోండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టీవీ చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ భోజనం చేయరాదు.భోజనం చేసే సమయంలో అతిగా మాట్లాడటం, నవ్వడం వంటివి చేయకూడదు.

భోజనం చేసేటప్పుడు ప్లేట్ ను విసరడం, కాలితో తన్నడం వంటివి దరిద్ర కారణాలుగా చెబుతారు.అన్నం తినేటప్పుడు ఎడమచేతితో ప్లేటును పట్టుకోకూడదు.తిరిగి అన్నమును ఎంగిలి చేతితో పట్టుకోకూడదు.భోజనం చేసేటప్పుడు మనం కూర్చున్న తర్వాతే వడ్డించు కోవాలి.

ముందుగా వడ్డించిన పళ్లెంలో తినరాదు.ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురు చూడాలి కానీ, మన కోసం అన్నం ఎదురు చూడకూడదు.

అన్నం పరబ్రహ్మస్వరూపం అని అంటారు.అలాంటి అన్నానికి ముందుగా నమస్కరించి భోజనం చేయాలి.భోజనం చేసేటప్పుడు ఏవైపు అయినా కూర్చొని తినవచ్చు.కానీ తూర్పు ముఖంగా తినడం వల్ల లాభాలు .ఎందుకనగా ఈ వైపు కూర్చుని భోజనం చేస్తే దీర్ఘాయుష్షు కలిగి ఉంటుందని మన ధర్మ శాస్త్రం చెబుతోంది.ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు కింద కూర్చొని చేయడం చాలా మంచిది.

భోజనం చేసేటప్పుడు ప్రతి రోజూ ఒకే సమయం పాటించడం వల్ల జీర్ణక్రియ సంబంధించినటువంటి వ్యాధులు రావు.భోజనం చేశాక కూడా కొన్ని పనులు చేయడం మంచిది కాదు.

భోజనం చేసిన వెంటనే తిన్న పళ్లెం లో చేయి కడగడం వల్ల దరిద్రాన్ని చూపిస్తుంది.భోజనం చేసిన వెంటనే కొంతమంది ఏదైనా పిన్ లేదా పుల్లలు తీసుకుని పళ్ళను కుడుతుంటారు.

ఇలా చేయడం ద్వారా పరమ దరిద్రం కలుగుతుంది.

#HinduRituals #Eating Rules #Rituals #Works At Eating #Eating Food

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

TELUGU BHAKTHI