'దొరసాని' ఫైనల్‌ రిజల్డ్‌ ఇదే  

Dorasani Movie Final Collections-

విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా జీవిత రాజశేఖర్‌ల కూతురు శివాత్మిక రాజశేఖర్‌ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి.‘దొరసాని’ సినిమా విడుదలకు ముందు చాలా ఎక్కువగానే ప్రమోషన్‌ చేశారు.సినిమాను సోషల్‌ మీడియాలో చాలా అగ్రెసివ్‌గా ప్రమోట్‌ చేసేందుకు చాలానే కష్టపడ్డారు.ఎంత కష్టపడ్డా కూడా చివరికి ఫలితం అటు ఇటు అయ్యింది.టాక్‌ పర్వాలేదు అన్నట్లుగా వచ్చినా కలెక్షన్స్‌ మాత్రం దారుణంగా ఉన్నాయట.

Dorasani Movie Final Collections- Telugu Tollywood Movie Cinema Film Latest News Dorasani Movie Final Collections--Dorasani Movie Final Collections-

రివ్యూవర్స్‌ ‘దొరసాని’ చిత్రానికి పాజిటివ్‌గానే రివ్యూలు ఇచ్చారు.కథ పాతదే అయినా దాన్ని చూపించిన తీరు బాగుందంటూ రివ్యూలు వచ్చాయి.దొరసాని రివ్యూల విషయం పక్కన పెడితే కలెక్షన్స్‌ మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేవు.మొదటి రెండు మూడు రోజులు పర్వాలేదు అన్నట్లుగా వచ్చినా సోమవారం నుండి కలెక్షన్స్‌ పూర్తిగా డ్రాప్‌ అయ్యాయి.

ఈ వారంతంకు 90 శాతం థియేటర్ల నుండి సినిమాను తొలగించే పరిస్థితి కనిపిస్తుంది.

రేపు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం వస్తున్న కారణంగా దొరసాని చిత్రంకు మరింత కష్టాలు తప్పవు.ఇస్మార్ట్‌ శంకర్‌కు పాజిటివ్‌ టాక్‌ వస్తే దొరసాని కలెక్షన్స్‌ క్లోజ్‌ అవ్వడం ఖాయం.అదే జరిగితే కనీసం 10 కోట్ల షేర్‌ కూడా రాబట్టకుండానే దొరసాని థియేటర్ల నుండి బయటకు నడవాల్సి ఉంటుందనే టాక్‌ వస్తుంది.క్రేజీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఇలాంటి పరిస్థితి ఏంటా అంటూ విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.