హైపర్ ఆది వల్లే చెడ్డపేరు.. దొరబాబు కామెంట్స్ వైరల్..?

జబర్దస్త్ కమెడియన్ గా తక్కువ కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు హైపర్ ఆది.హైపర్ ఆది స్కిట్ల కోసమే జబర్దస్త్ షోను చూసే ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు.

 Dorababu Comments About Hyper Aadi In Jabardast Skit, Comments Skit, Dorababu, H-TeluguStop.com

అతని స్కిట్లకు యూట్యూబ్ లో కూడా భారీగా వ్యూస్ వస్తాయి.సినిమాల్లో ఆది అంతగా సక్సెస్ కాకపోయినా బుల్లితెరపై మాత్రం జబర్దస్త్, ఢీ షోలతో పాటు ఈటీవీ ఛానెల్ పండుగ రొజుల్లో, ప్రత్యేక రోజుల్లో ప్రసారం చేసే ఈవెంట్లలో సైతం తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ ఆది ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఉంటారు.

కొన్ని సందర్బాల్లో ఆది కామెడీ హద్దులు దాటుతుందని కొందరు విమర్శలు చేసినా యూత్ ను ఆకట్టుకునేలా ఆది స్కిట్లు ఉండటం గమనార్హం.జబర్దస్త్ షోలోకి జూనియర్ ఆర్టిస్ట్ గా అదిరే అభి స్కిట్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆది స్పాంటేనియస్ గా పంచ్ లు వేస్తుంటాడు.

అయితే ఆది తన స్కిట్లలో గతంలో రైడింగ్ లో దొరికిపోయిన దొరబాబు, పరదేశీలపై పలుమార్లు పంచ్ లు వేసిన సంగతి తెలిసిందే.

వాళ్లు పోలీస్ రైడింగ్ లో దొరికి సంవత్సమైనా ఆది వాళ్లిద్దరిపై తన పంచ్ ల ద్వారా స్కిట్లు హిట్ అయ్యేలా చేస్తుంటారు.తాజాగా జబర్దస్త్ ప్రోమో విడుదల కాగా ఆ స్కిట్ లో దొరబాబు ” అక్కడ ట్రంప్ ఎందుకు ఓడిపోయాడో తెలుసా.? అవతలి వైపు మేం ప్రచారం చేశాం కాబట్టి” అని చెప్పగా హైపర్ ఆది ” ఇక్కడ మీరు కంపు ఎందుకయ్యారో తెలుసా.ఇక్కడ కూడా మీరు ప్రచారం చేశారు కాబట్టి” అని పంచ్ వేస్తాడు.

హైపర్ ఆది అలా పంచ్ వేయడంతో తాను ప్రచారం చేయడం లేదని.

ఆదినే ప్రచారం చేశాడని కౌంటర్ ఇచ్చారు.దొరబాబు అలా చెప్పగానే హైపర్ ఆది ఫక్కున నవ్వేశారు.

దొరబాబు పరోక్షంగా హైపర్ ఆది ప్రచారం వల్లే తనకు చెడ్డపేరు వచ్చిందని చెప్పాడు.ఈ ప్రోమోకు మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube