దొరబాబు అలా దొరికి పోవడంతో హైపర్ ఆదికి కొత్త తలనొప్పి స్టార్ట్ అయ్యిందా...

తెలుగులో టిఆర్పి రేటింగుల పరంగా దూసుకుపోతున్న కామెడీ షోలలో ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో ఒకటి.ఈ షో స్టార్ట్ చేసిన మొదట్లో అయితే దాదాపుగా టిఆర్పి రేటింగ్ ల విషయంలో పలు రికార్డులు బద్దలు కొట్టింది.

 Dorababu And Paradesi Arrest Issue Headache To The Hyper Aadi-TeluguStop.com

అఅంతేగాక ఈ షో కేవలం టిఆర్పి రేటింగులు పరంగా మాత్రమే కాకుండా పలువురు కమీడియన్లను వెండి తెరకు హీరోగా కూడా పరిచయం చేసింది.అయితే తాజాగా ఈ జబర్దస్త్ షోకి సంబంధించినటువంటి కొన్ని వార్తలు నట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ జబర్దస్త్ షోకి సంబంధించినటువంటి ఇద్దరు కమెడియన్లు పరదేశి మరియు దొరబాబు విశాఖపట్టణంలోని ఓ అపార్ట్మెంట్ లో వ్యభిచారం లో పాల్గొంటూ పోలీసులకు దొరికిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే వీళ్లిద్దరూ జబర్దస్త్ షోలో మంచి పేరు తెచ్చుకున్న ఇటువంటి హైపర్ ఆది టీం లో చేస్తుండటంతో ఈ ఎఫెక్ట్ హైపర్ ఆదిపై పడినట్లు తెలుస్తోంది.

అంతేగాక హైపర్ ఆది కూడా గతంలో బాబు నటించినటువంటి పలు షార్ట్ ఫిలిమ్స్ ని ఆధారంగా చేసుకుని తన స్కిట్ లో కామెడీ పండించడం కోసం వాటిని హైలెట్ చేస్తూ పంచులు పెల్చేవాడు.దీంతో ఈ విషయాన్ని ప్రస్తుతం నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేగాక రీల్ లైఫ్ లో అలాంటి సన్నివేశాల్లో నటించే వారికి రియల్ లైఫ్ లో నటించడం పెద్ద సమస్యేమీ కాదు అంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు.ఏదేమైనప్పటికీ తన టీంలో పని చేస్తున్నటువంటి ఇద్దరు ఆర్టిస్టులు దొరికిపోవడంతో హైపర్ ఆది షో నిర్వాహకుల నుంచి పలు ప్రశ్నలను ఎదుర్కొంటున్నాడు.

Telugu Dorababu, Hyper Aadi-Movie

అయితే సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నప్పటికీ దొరబాబు మరియు పరదేశీలు మాత్రం మీడియా ముందుకు రావడం లేదు. అయితే హైపర్ ఆది అభిమానులు మాత్రం దొరబాబు మరియు పరదేశి లను మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube