రంగంలోకి రెండో కేసీఆర్ .. !  

  • ఎన్నికల సందడి మొదలయితే చాలు … రాజకీయ పార్టీలు చిత్ర విచిత్ర వేషాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక జిమ్మిక్కులు చేస్తూ ఉంటాయి. నవ్వించో… కవ్వించో ఓటర్లను తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఆ విధంగానే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తమ అధినేత కేసీఆర్ డూప్ ని రంగంలోకి దింపి ఎన్నికల ప్రచారం చేయిస్తోంది. దూరం నుంచి అతడు అచ్చం కేసీఆర్ లా ఉండడంతో … జనాలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక అతడు మాములుగా ఊరుకుంటాడా … దారినపోయే ప్రతి ఒక్కరికీ షేక్ హ్యాండ్‌ ఇస్తున్నారు. సంతలో మొత్తం కలయ తిరుగుతున్నాడు డూప్‌ కేసీఆర్. మంచిర్యాల టీఆర్ఎస్‌ అభ్యర్థి కోసం, గులాబీ బాస్‌లా మేకప్‌ వేసుకుని, ప్రచారం చేస్తున్నాడు.

  • Doop Kcr At Manchiryal-

    Doop Kcr At Manchiryal

  • కేసీఆర్‌లా ఉండటమే కాదు, పంచ్‌లు కూడా బాగానే విసురుతున్నాడు… అచ్చం కేసీఆర్ పోలికలు….అవే హావభావాలతో సందడి చేస్తున్న ఇతని పేరు రాజా రమేష్. హైదరాబాద్‌లో మేకప్‌మెన్. 2009 నుంచి టిఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ సంతలో క్యాంపెయిన్‌ చేశాడు. దూరం నుంచి చూసిన జనం కూడా, సేమ్‌ కేసీఆర్‌లా ఉండటంతో తొలుత షాక్‌ అయ్యారు. కేసీఆర్‌ ఏంటీ….మనమధ్యకు రావడమేంటని షాక్‌ అయ్యారు. దగ్గరకు వచ్చేకొద్దీ అసలు రూపమెవరిదో తెలిసి, నవ్వుకున్నారు. అదీ కేసీఆర్ డూప్‌ కథ.