కరోనాతో ఆందోళన చెందొద్దు : మంత్రి ఎర్రబెల్లి  

telangana, Minister, Errabelli, Don\'t worry, Corona, - Telugu Corona, Don\\'t Worry, Errabelli, Minister, Telangana

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినా రికవరీ రేటు అధికంగా ఉందని, ఎవరూ అందోళన చెందొద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాలలో అధికారులను అప్రమత్తం చేసి కరోనా బాధితులు క్యూర్ అయ్యేలా బాధ్యతలు వహిస్తున్నారు.

TeluguStop.com - Dont Worry About Corona Minister Errabelli

ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా బాధితులతో, వారి కుటుంబ సభ్యులు, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.వైద్యాధికారులు, పోలీసులు తదితరులతో మాట్లాడి కరోనా బాధితులపై తీసుకుంటున్న జాగ్రత్త చర్యలపై అడిగి తెలుసుకున్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.‘‘రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.కరోనా నిబంధనలు పాటిస్తూ.

TeluguStop.com - కరోనాతో ఆందోళన చెందొద్దు : మంత్రి ఎర్రబెల్లి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పోలీసులు, డాక్టర్లకు సహకరించాలి.కరోనా వైరస్ తో భయపడొద్దు.

అందరం కలిసి ఉంటూ ధైర్యంగా ఎదుర్కొవాల్సిన తరుణం ఇది.నియోజకవర్గంలో ఉన్న కోవిడ్ కేంద్రాల్లో మెరుగైన సదుపాయాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం.అత్యవసర సేవలకు అంబులెన్స్ లను కూడా ఏర్పాటు చేస్తున్నాం.కరోనాకు పూర్తి స్థాయిలో టీకా వచ్చేంతవరకూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించండి.బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం.శానిటైజర్ తో చేతులు కడుక్కోవడం.

సామాజికదూరం పాటించాలి.సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తున్నారు.

కరోనాపై పోరాటంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు.’’ అని ఆయన పేర్కొన్నారు.

#Errabelli #Telangana #Corona #Don't Worry #Minister

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dont Worry About Corona Minister Errabelli Related Telugu News,Photos/Pics,Images..