ట్రంప్ కు మాత్రం ఓటు వెయ్యకండి: 92 ఏళ్ల బామ్మ చివరి కోరిక!  

92 Year Old Grand mother Last wish not to vote for trump, Donald trump, america elections, Minnesota woman, Last wish, Joe biden, Bank account in china - Telugu 92 Year Old Grand Mother Last Wish Not To Vote For Trump, America Elections, Bank Account In China, Donald Trump, Joe Biden, Last Wish, Minnesota Woman

నవంబర్ 3న జరగబోయే అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ల మధ్య హోరాహోరీగా ప్రచారం సాగింది.కొన్ని సర్వేలు వెల్లడించిన ఫలితాల ప్రకారం ట్రంప్ కన్నా బిడెన్ ముందు వరుసలో ఉన్నారు అని వెల్లడించింది.

TeluguStop.com - Dont Vote For Trump 92 Year Old Grandmothers Last Wish

కానీ గెలుపు మాత్రం తనదేనని ట్రంప్ పలు సందర్భాలలో వ్యక్తపరిచాడు.ట్రంప్ఎలక్షన్లలో గెలుస్తాడో, లేదో తెలియదు కానీ, అతనిమీద అడుగడుగున తీవ్రవిమర్శలు తలెత్తుతున్నాయి.

కరోనా నేపథ్యంలోట్రంప్ తీరు అక్కడి ప్రజలను తీవ్ర అసహనానికి గురి చేసింది.అంతే కాకుండా తాజాగా చైనాలో ట్రంప్ కు బ్యాంక్ అకౌంట్ ఉందని తెలియడంతో ట్రంప్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

TeluguStop.com - ట్రంప్ కు మాత్రం ఓటు వెయ్యకండి: 92 ఏళ్ల బామ్మ చివరి కోరిక-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ విషయాలన్నీ ట్రంప్ కి కునుకు లేకుండా చేస్తున్నాయి.అయితే ట్రంప్ మరొక పిడుగులాంటి వార్త వినడంతో అతని పరిస్థితి అయోమయంలో పడిపోయింది.

అమెరికా లో జరగబోయే అధ్యక్షపదవి ఎన్నికలలో ట్రంప్ కు మాత్రం ఓటు వెయ్యకండి అని 92 సంవత్సరాల బామ్మ తన చివరి కోరికగా తెలిపింది.ఈ మేరకు తను చనిపోయే ముందు తన చివరి కోరికను లేఖలోరాసి చనిపోయింది.

మిన్నెపోలిస్ ఇన్వ‌ర్ గ్రోవ్ హైట్స్‌కు చెందిన జార్జియా అనే బామ్మ సెప్టెంబర్ 28న గుండెపోటుతో మరణించింది.తను చనిపోయే ముందు తన దహన సంస్కారాలు ఎలా చేయాలో కూడా ఆ లేఖలో రాసింది.

కరోనా ప్రోటోకాల్ ను పాటిస్తూ తన దహన సంస్కారాలు చేయాలని అందులో పేర్కొంది.అలాగే తన సమాధిపై పుష్పగుచ్ఛాలు కు బదులుగా ట్రంప్ కు ఓటు వేయవద్దని తన సంస్కరణ సభకు వచ్చిన వారిని కోరింది.

ఈ బామ్మ కోరిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ పోస్ట్ ను కొద్ది నిమిషాలలో లక్షలలో వ్యూస్ రావడంతో, దీనిని కొందరు ప్రశ్నించగా… మరికొందరు సమర్ధించారు.

ఏది ఏమైనా ట్రంప్ కు ఇదొక నెగటివ్ పాయింట్ అని చెప్పవచ్చు.

#Last Wish #Donald Trump #Joe Biden #92Year #BankAccount

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dont Vote For Trump 92 Year Old Grandmothers Last Wish Related Telugu News,Photos/Pics,Images..