ఆ లేఖపై ఎవరు మాట్లాడకండి .. వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు !  

Sajjala Orders not to respond on ys jagan letter,cm jagan, apcm jagan, jagan,nv ramana, ap, Sajjala Ramakrishnareddy - Telugu Ap, Apcm Jagan, Cm Jagan, Jagan, Nv Ramana, Sajjala Ramakrishnareddy

ఈ నెల 10వ తేదీన ఏపీ హైకోర్టు విషయమై సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీరమణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు సీఎం జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

TeluguStop.com - Dont Respond On Cm Jagan Letter Says Ysrcp General Secretary Sajjala Ramakrishna Reddy To Ysrcp Leaders

న్యాయవాదులు అయితే దీన్ని గట్టిగా ఖండిస్తున్నారు.కొంతమంది సీఎం జగన్ కి అనుకూలంగా మాట్లాడుతూంటే మరికొంత మంది కోర్టుల్లో పిటిషన్లు వేసి మరీ జగన్ మీద చర్యలకు డిమాండ్లు చేస్తున్నారు.

సీఎం జగన్ ఒక సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తికి వ్యతిరేకంగా లేఖ రాయడాన్ని న్యాయ వ్యవస్థ మీద దాడిగా ఢిల్లీ బార్ అసోసియేషన్ అభివర్ణిస్తోంది.సీఎం జగన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

TeluguStop.com - ఆ లేఖపై ఎవరు మాట్లాడకండి .. వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అలాగే , మరో వైపు మొన్న నోయిడాకు చెందిన ఒక న్యాయవాది సీఎం జగన్ మీద చర్యలు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనితో ఈ వ్యవహారం పై లోలోపల దేశ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సీజేఐకు జగన్ రాసిన లేఖపై వైసీపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఎవరూ మాట్లాడవద్దని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు.ఈ అంశం పై ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, బహిరంగంగా మాట్లాడటం కానీ, పత్రికా ప్రకటనలు విడుదల చేయడం కానీ చేయవద్దని ఆదేశించారు.

ఈ మేరకు అందరికీ వాట్సాప్ ద్వారా సందేశాలు పంపించారు.

.

#Nv Ramana #CM Jagan #Apcm Jagan #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dont Respond On Cm Jagan Letter Says Ysrcp General Secretary Sajjala Ramakrishna Reddy To Ysrcp Leaders Related Telugu News,Photos/Pics,Images..