ఉంది కదా అని ఫ్రిజ్‌ లో ఏది పడితే అది పెడితే ప్రాణాలకే ప్రమాదం... ఫ్రిజ్‌ లో ఇవి పెడితే విషమవుతాయి  

ఇంట్లో ఫ్రిజ్‌ ఉంది కదా అని అందులో అవి ఇవి పెడుతూ ఉంటారు. అయితే ఫ్రిజ్‌లో ఏది పడితే అవి పెట్టకూడదు అంటున్నారు నిపుణలు. కొన్ని పదార్థాలు ఫ్రిజ్‌లో పెడితే పాడుకాకుండా ఉంటాయి, కాని కొన్ని పదార్థాలు మాత్రం ఫ్రిజ్‌లో పెడితే పాడు అవుతాయి. ఫ్రిజ్‌లో పెడితే పాడు అవ్వడమే కాకుండా, కొన్ని విషంగా కూడా మారుతాయనే ప్రచారం ఉంది. ముఖ్యంగా అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెడితే అవి విషం అవుతాయని అంటారు. అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు నిజమే కాని ఫ్రిజ్‌లో పెడితే విషం అవ్వడం నిజం కాదు.

Don't Put These Items In Your Fridge-Dont's With Fridge Fridge Unknown Facts Of

Don't Put These Items In Your Fridge

ఇప్పుడు ఏ పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదో చూద్దాం :

డ్రై ఫ్రూట్స్‌ :
బాదం, జీడిపప్పు, కిస్మిస్‌ వంటివి ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల వాటిలో ఉన్న ఆయిల్‌ కంటెంట్‌ కోల్పోతాయి. అలా కోల్పోవడం వల్ల రుచి కూడా ఉండకుండా ఉంటాయి. ఆరోగ్యంకు కూడా అంత మంచిది కాదు.

Don't Put These Items In Your Fridge-Dont's With Fridge Fridge Unknown Facts Of

వెల్లుల్లి :
వెల్లుల్లి గడ్డ లేదా వెల్లుల్లి రెబ్బలు ఫ్రిజ్‌లో పెట్టడం ఎంత మాత్రం కరెక్ట్‌ కాదు. ఎందుకంటే ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిలో ఉండే తేమ పోయి పాడవుతాయి.

పుచ్చకాయ :
పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. కాని ముచ్చకాయను మొత్తం చెక్కుతో సహ ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల కుల్లిపోయే అవకాశం ఉంది.

ఉల్లిపాయలు :
ఎల్లిపాయ మాదిరిగానే ఉల్లిపాయ కూడా ఫ్రిజ్‌లో పెడితే దాని గుణంను కోల్పోతుంది. అందుకే ఫ్రిజ్‌కు దూరంగా ఉల్లిపాయను ఉంచాలి.

మామిడి కాయలు :
మామిడి కాయలను ఫ్రిజ్‌లో పెడితే ఎలా పెట్టామో అలాగే ఉంటాయి. అందుకే కాయలను బయట పెట్టాలి, అవి పండుతాయి. పండిన తర్వాత కుళ్లి పోకుండా ఉండాలి అంటే ఫ్రిజ్‌లో పెట్టాలి.

తేనె :
ఎక్కువ శాతం మంది తేనెను ఫ్రిజ్‌లో పెడతారు. కాని బాగా చలికి తేనెలోని దాని సహజ గుణాలు పోతాయి.

Don't Put These Items In Your Fridge-Dont's With Fridge Fridge Unknown Facts Of

టమాట :
కురగాయలు ఎక్కువ శాతం ఫ్రిజ్‌లో ఉంటే బాగుంటాయి. కాని టమాట మాత్రం ఫ్రిజ్‌లో ఉంటే పాడవుతాయి.

మునక్కడలు :

Don't Put These Items In Your Fridge-Dont's With Fridge Fridge Unknown Facts Of

మునక్కడలు కట్‌ చేసి లేదా అలాగే ఫ్రిజ్‌లో పెడతారు. అలా పెట్టడం వల్ల మునక్కడలోని తేమ పోతుంది. అది కేవలం పీచు మాదిరిగా తయారు అయ్యి రుచి లేకుండా అవుతుంది.