ల‌క్నోకు వెళితే...వీటిని తిన‌డం మిస్ కావొద్దు.! పెద్ద చ‌రిత్రే ఉందండోయ్.!!  

Don\'t Miss Tunday Kababi In Lucknow Because It Is Famous-tunday Kababi,tunday Kababi In Lucknow,viral About Tunday Kababi In Lucknow

ప్రస్తుతం మనకు తినేందుకు రక రకాల కబాబ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా తమ ఇష్టాలకు అనుగుణంగా కబాబ్స్‌ను తింటారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో టుండే కబాబ్స్ అని విక్రయిస్తారు..

ల‌క్నోకు వెళితే...వీటిని తిన‌డం మిస్ కావొద్దు.! పెద్ద చ‌రిత్రే ఉందండోయ్.!!-Don't Miss Tunday Kababi In Lucknow Because It Is Famous

వీటి గురించి మన దగ్గర తెలియకపోవచ్చు. కానీ అక్కడ మాత్రం ఈ కబాబ్స్ చాలా ఫేమస్.

ఇవి అన్ని రకాల కబాబ్స్‌లా ఉండవు. భిన్నంగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉంటాయి.

అందుకే అవి అక్కడ చాలా ఫేమస్ అయ్యాయి. అయితే ఆ కబాబ్స్‌కు టుండే కబాబ్స్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా.? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు అసఫ్-ఉద్ దౌలా అనే నవాబుకు అనుకోకుండా కొన్ని దంతాలు ఊడిపోయాయట. దీంతో ఆయన తనకు ఎంతగానో ఇష్టమైన కబాబ్స్‌ను తినకుండా అయింది. ఈ క్రమంలో కబాబ్స్‌ను గట్టిగా కాకుండా మెత్తగా ఉంటే తినవచ్చని భావించిన నవాబు ఒక పోటీ పెట్టాడు.

ఎవరైతే చాలా మెత్తగా కబాబ్‌లను చేసి ఇస్తారో వారికి రాజ ఆస్థానంలో సకల మర్యాదలు ఉంటాయని చెప్పాడు. దీంతో కబాబ్‌లను తయారు చేసేందుకు చాలా మంది వచ్చారు. .

అలా కబాబ్ పోటీలో పాల్గొన్న హాజీ మురద్ అలీ అనే వ్యక్తి చాలా మెత్తగా కబాబ్‌లను తయారుచేయడంతో అతనికి రాజ గౌరవం లభించింది. అయితే మురద్ అలీ చిన్నతనంలో గాలిపటాలను ఎగురవేస్తుండగా, అతని చేయికి గాయమై ఆ చేయికి అంగవైకల్యం ఏర్పడింది.

దీంతో అలాంటి వైకల్యం ఉన్నందున అతన్ని టుండే అని పిలిచేవారట. అయితే రాజ ఆస్థానంలో కబాబ్ పోటీలో గెలిచాక సదరు టుండే పేరిటే మురద్ చేసిన కబాబ్‌లకు టుండే కబాబ్స్ అని పేరు పెట్టారు. దీంతో ఆ పేరు అప్పటి నుంచి ఆ కబాబ్స్‌కు అలాగే కొనసాగుతూ వస్తోంది..

మురద్ తరువాత అతని కుమారుడు హజీ రాయిస్ అహ్మద్ తన తండ్రి కబాబ్ షాపును కొనసాగించాడు. తరువాత మురద్ మనవడు మహమ్మద్ ఉస్మాన్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. టుండే కబాబీ పేరిట వారికి లక్నోలో షాప్ ఉంది. లక్నోలోని చౌక్ ఏరియాలో ఉన్న క్రాస్ రోడ్స్ వద్ద ఆ షాపులో టుండే కబాబ్స్‌ను విక్రయిస్తారు.

ఆ షాపు ఇప్పుడక్కడ చాలా ఫేమస్ అయింది. .

అయితే కాల క్రమేణా అక్కడ అనేక టుండే కబాబ్ షాపులు వెలిశాయి. అసలైన టుండే కబాబ్స్‌పై తమకే హక్కు ఉందంటే తమకే ఉందని పలువురు కోర్టుకు వెళ్లారు. అయినప్పటికీ మురద్ మనవడు మహమ్మద్ ఉస్మాన్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది.

టుండే కబాబ్స్‌పై మురద్ వంశీయులకే హక్కు ఉందని, వాటిపై వారికే పేటెంటు లభిస్తుందని కోర్టు తీర్పు చెప్పింది. ఇక టుండే కబాబ్స్ అంత సుతిమెత్తగా ఉండి, అంత రుచి ఉండేందుకు కారణం. వాటి తయారీలో 160 రకాల మసాలాలను కలిపిన ప్రత్యేక రెసిపిని వాడుతారు. అందుకే టుండే కబాబ్స్‌కు అంత పేరు వచ్చింది. మరి. మీక్కూడా ఆ కబాబ్స్‌ను తినాలని ఉంటే లక్నో దాకా వెళ్లక తప్పదు మరి.!2 Attachments