కార్లలో వాటర్‌ బాటిల్స్‌ ఉంచవద్దంటూ ప్రభుత్వం హెచ్చరిక.. ఎందుకు? ఎక్కడ?

గతంలో ఎప్పుడు లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మొన్నటి వరకు మండి పోయిన విషయం తెల్సిందే.రుతుపవనాల ఆగమనంతో తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డాయి.కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు దేశం మొత్తం కూడా చల్లబడింది.40 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతకే మనం వామ్మో అనుకున్నాం.ఎప్పుడెప్పుడు వర్షాకాలం వస్తుందా అని ఎదురు చూశాం.అయితే కువైట్‌ లో ఏకంగా 60 నుండి 70 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్లుగా అక్కడి వాతావరణ శాఖ వెళ్లడించింది.

 Dont Leave Bottles Of Water Inside The Car1-TeluguStop.com

మామూలుగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది.ఇక అంత భారీ ఉష్ణోగ్రతలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే వామ్మో అనిపిస్తుంది కదా.కార్లను ఎండలో పెడితే పేలిపోయే పరిస్థితి వస్తుంది.ఈమద్య కాలంలో కువైట్‌ లో కార్లు కాలిపోవడం అధికంగా జరుగుతుంది.

దానికి కారణం అన్వేషించిన నిపుణులు కారులో వాటర్‌ బాటిల్స్‌ ఉన్నాయని గుర్తించారు.కారులోని వాటర్‌ బాటిల్స్‌పై సూర్యరశ్మి పడటంతో అవి బాగా వేడి అవుతాయి.

బాగా వేడిగా ఉన్న బాటిల్స్‌ నుండి సూర్యరశ్మి పరావర్తనం చెంది కారు సీట్లపై పడటంతో ఆ సీట్లు కాస్త మండుతున్నాయట.

కార్లలో వాటర్‌ బాటిల్స్‌ ఉంచ�

సీట్లకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా కారు అంతా కాలి పోతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.కార్లను ఎండలో పెట్టడం మంచిది కాదు.ఒక వేళ ఎండలో పెట్టాల్సి వస్తే కారులో వాటర్‌ బాటిల్స్‌ లేకుండా పెట్టాలంటూ సూచిస్తున్నారు.

ప్రస్తుతం కువైట్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది.ఎమర్జెన్సీ కారణంగా ఉదయం మరియు మద్యాహ్నం సమయంలో ఆఫీస్‌లు ఓపెన్‌ చేయడం లేదు.బస్సులు మరియు ఇతర ప్రైవేట్‌ వెయికిల్స్‌ కూడా తిరగకుండా నిషేదం విధించారు.మొత్తానికి అక్కడ ఎండలు జనజీవనంను అస్థవ్యస్థం చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube