మోడీ పరిపాలన భారత్ లో పత్రికా స్వేచ్చ హరించిపోయింది అంటున్న ఆ నివేదిక  

మోడీ పాలనలో పత్రికా స్వేచ్చ లేదంటున్న వితౌట్ బోర్డర్స్ .

Don\'t Have Dom Of Speech To Media In India-congress,don\\'t Have Dom Of Speech,india,media,modi

ప్రతీకా స్వేచ్చ ఎక్కువగా ఉండే దేశాల జాబితాలో ఒకప్పుడు ఇండియా టాప్ లో ఉండేది. జర్నలిస్ట్ పేపర్ లో ఒక వార్త రాస్తే అధికారుల నుంచి నాయకుల వరకు అందరూ భయపడే వారు. అలాగే వార్తకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు..

మోడీ పరిపాలన భారత్ లో పత్రికా స్వేచ్చ హరించిపోయింది అంటున్న ఆ నివేదిక-Don't Have Freedom Of Speech To Media In India

అదే సమయంలో జర్నలిస్ట్ లపై సమాజంలో గౌరవం కూడా ఎక్కువగా ఉండేది. మన పత్రికా జర్నలిస్ట్ అంటే సినిమాలలో చూపించినట్లు భుజానికి ఒక బ్యాగ్, జేబులో పెన్ను పెట్టుకొని, సైకిల్ మీద ఎక్కడికైనా వెళ్లి ధైర్యంగా వార్తలు సేకరించే వ్యక్తి కనిపిస్తాడు. అయితే అలాంటి జర్నలిస్ట్ ఇప్పుడు ధైర్యంగా వార్తలు రాయలేని పరిస్థితి వచ్చేసింది.

ప్రపంచ దేశాలలో పత్రికా స్వేచ్ఛలో భారత్ ఎంతగా దిగజారిపోతోంది అనే విషయాన్ని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ 180 దేశాలలో పత్రికా స్వేచ్ఛ మీద ఉన్న పరిస్థితులను విశ్లేషించి ర్యాంక్ లను ప్రదర్శిస్తుంది. ఇందులో భారత్ 140 స్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది రెండు స్థానాలు దిగజారింది. జర్నలిస్టులపై ద్వేషం, హింస రూపు దాలుస్తోందని, భయోత్పాతాన్ని పెంచుతోందని ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ పట్టిక పేర్కొంది. హిందూత్వని సమర్థించే ప్రధాని మోడీ మద్దతు దారులు వారికి వ్యతిరేకంగా వినిపించే నోళ్లు మూయించేందుకు ప్రణాళిక బద్దంగా విషం చిమ్ముతూ స్వేచ్ఛను హరిస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది.