ఏ పని చేసినా సక్సెస్‌ అవ్వడం లేదా... నిరాశ నిసృహలో ఉన్న వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు  

Failure Inspirational Speech - Telugu

దేనికైనా టైం రావాలని అంటారు పెద్దవారు, అంటే మనం ఏ పని చేసినా కూడా అది సక్సెస్‌ అవ్వాలి అంటే ఆ టైం రావాల్సి ఉంటుంది.అలా అని టైం కోసం ఎదురు చూస్తూ కష్టపడకుండా ఉంటే ఆ టైం అనేది అసలే రాదు.

TeluguStop.com - Dont Get Bad For Your Failures

కష్టపడ్డా కూడా కొన్ని సార్లు సక్సెస్‌ అనేది దక్కదు.అలాంటి సమయంలో నిరుత్సాహ పడకుండా కష్టంను కంటిన్యూ చేస్తూ ఉంటే తప్పకుండా ఒక టైం అంటూ వస్తుంది.

ఆ టైంకు మనకు సక్సెస్‌ అనేది దక్కుతుందని పెద్దలు అంటున్నారు.కొందరు ఎంత ప్రయత్నించినా కూడా సక్సెస్‌ దక్కడం లేదు, నాకు అదృష్టం లేదేమో, అసలు నేను ఆ సక్సెస్‌కు అర్హుడిని/ అర్హురాలిని కాదేమో అంటూ తమపై తామే బ్యాడ్‌ గా ఒక నిర్ణయానికి వచ్చేస్తారు.

TeluguStop.com - ఏ పని చేసినా సక్సెస్‌ అవ్వడం లేదా… నిరాశ నిసృహలో ఉన్న వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు-Telugu Health-Telugu Tollywood Photo Image

ఒక్కసారి ప్రయత్నించి విఫలం అయితే వదిలేస్తారు.కాని అలా చేయడం నూటికి నూరు పాళ్లు తప్పు.

అలా ఎప్పటికి చేయకూడదు.

ఒక పని చేయాలనుకున్నప్పుడు, ఒక విజయం దక్కాలనుకున్నప్పుడు అందుకోసం పూర్తిగా శ్రమించాలి.

శక్తివంచన లేకుండా శ్రమించినా కూడా ఆ విజయం అనేది దక్కకుంటే అది నీ తప్పు కాదు.ఏదో ప్రయత్నిద్దాం వస్తుందిలే అన్నట్లుగా లైట్‌ తీసుకుంటే అది విఫలం అయితే అది ఖచ్చితంగా నీ తప్పు అవుతుంది.

అందుకే ఏదైనా పని చేసినప్పుడు పూర్తి ఎఫర్ట్‌ పెట్టి చేయాలి.

ఇక సక్సెస్‌ అవ్వకపోయినంత మాత్రాన నిరాశకు గురి అవ్వాల్సిన పని లేదు.

నువ్వు పడ్డ కష్టం ఇప్పుడు కాకున్నా మరెప్పుడైనా కూడా ఉపయోగపడుతుందనే విషయంను గుర్తుంచుకోవాలి.ప్రతి వ్యక్తి కూడా జీవితంలో సక్సెస్‌ అవ్వడం వెంటనే జరిగిపోదు.అలాగే మీరు కూడా మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయాలి

సక్సెస్‌ కోసం చేసే ప్రయత్నం జీవితాన్ని మార్చేస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది.ఇది నా జీవితంలో కీలక మలుపులు తీసుకు వస్తుంది, ఇది సక్సెస్‌ అయితే నా జీవితమే మారిపోతుందనే పాజిటివ్‌ థాట్‌తో ఆ పని చేయాలి.

ఉదాహరణకు ఏదైనా ఉద్యోగం కోసం పరీక్షకు సిద్దం అయ్యే సమయంలో కష్టపడి చదవాలి.ఒకవేళ ఆ ఉద్యోగం రాకుంటే చదివింది అలాగే ఉంటుంది, జ్ఞానం ఎటు పోదు.

ఆ జ్ఞానంతో తర్వాత సారి అయినా, మరో ఉద్యోగం అయినా దక్కించుకోవచ్చు.

అందుకే ఏ ఒక్కరు కూడా ఒక్కటి రెండు సార్లు ఫ్లాప్‌ అవ్వగానే, సక్సెస్‌ దక్కకుండా పోగానే కృంగిపోకూడదు.నిరాశకు లోనుకాకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి

ఎంతో మంది శాస్త్రవేత్తలు అద్బుతాలను ఒక్కసారికే ఆవిష్కరించలేదు.ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసి, వందల సార్లు విఫలం అయిన తర్వాత అప్పుడు సక్సెస్‌లను దక్కించుకున్నారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు