ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జులై 31 చివరి తేదీ.! ఈ ముఖ్యమైన విషయాలు అస్సలు మరవకండి.!

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రానికి(2017-18) సంబంధించిన ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు జులై 31,2018 చివ‌రి తేదీ అన్న సంగ‌తి తెలిసిందే.గ‌డువు స‌మీపిస్తుండ‌టంతో ఇంకా రిట‌ర్నులు దాఖలు చేయ‌నివారి త్వ‌ర‌గా చేసుకోవ‌డం మంచిది, లేక‌పోతే రూ.10 వేల వ‌ర‌కు ఆల‌స్య రుసుములు చెల్లించ‌వ‌ల‌సి వ‌స్తుంద‌న్న‌ విష‌యాన్ని గుర్తుంచుకోండి.అయితే ఆదాయానికి సంబంధించి కొన్నింటిని మాత్రం అస‌లు మ‌ర‌వ‌కూడ‌దు.

 Dont Forget To Mention These Small Things While Filing Income Tax Returns-TeluguStop.com

చాలా మంది సంపాద‌న‌ప‌రులు కేవ‌లం ఫారం-16తో స‌రిపోలే విధంగా మాత్ర‌మే వారి వేత‌న ఆదాయాన్ని ఐటీ శాఖ‌కు వెల్ల‌డిస్తారు.కొన్నింటిని తేలిగ్గా వ‌దిలేస్తారు.ఒక ప‌రిమితి వ‌ర‌కూ పొదుపు ఖాతాపై వ‌చ్చే వ‌డ్డీకి సెక్ష‌న్ 80టీటీఏ కింద మిన‌హాయింపు ఉన్న‌ప్ప‌టికీ ఆ వ‌డ్డీ ఆదాయాన్ని మీ మొత్తం ఆదాయంలో చూపించ‌క త‌ప్ప‌దు.ఒక్కో సారి ఎఫ్‌డీ మీద వ‌చ్చే వ‌డ్డీకి మిన‌హాయించిన టీడీఎస్ కాకుండా… మీరు వేరే ప‌న్ను శ్లాబులో ఉండి ఉండొచ్చు.

అప్పుడు 5,10, 20,30 ప‌న్ను శ్లాబు ఏదైనా వ‌ర్తించ‌వ‌చ్చు.అయితే ఏ ప‌న్ను శ్లాబులో ఉన్నారు, ఎంత శాతం ప‌న్ను అమ‌ల‌వుతోందో వెల్ల‌డించ‌వ‌ల‌సిన బాధ్య‌త ప‌న్ను చెల్లించేవారిదే.

మీకు రెండు సొంత గృహాలు ఉన్న‌ట్లైతే, రెండోది అద్దెకి ఇచ్చి ఉంటే, ఆదాయ‌పు పన్ను చ‌ట్టం ప్ర‌కారం ఇంటి అద్దె ఆదాయం, మున్సిప‌ల్ బిల్లులు వంటి వివ‌రాల‌ను ఐటీ రిట‌ర్నుల్లో చూపాల్సి ఉంటుంది.ఒక‌వేళ ఇంటిపై రుణం ఉన్న‌ట్లైతే దానికి సంబంధించిన రుణ‌, వ‌డ్డీ వివ‌రాల‌ను అందుబాటులో ఉంచుకోవాలి.అంతేకాదు కొంత మంది చ‌రాస్తులు, విలువైన బ‌హుమ‌తుల రూపంలో ప్ర‌యోజ‌నాలు పొంది ఉండొచ్చు.ఇంకా కొంత మంది ఇన్సెంటివ్‌ల రూపంలో విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లి ఉండొచ్చు.అవి మీ బ్యాంకు ఖాతాల్లో వెల్ల‌డ‌య్యే అవ‌కాశం లేనందున మీ ఆదాయంలో వాటిని చూపించ‌కుండా ఉండే అవ‌కాశం ఉంది.వీటిని ఐటీఆర్ ఫైలింగ్ స‌మ‌యంలో స్థూల ఆదాయంలో భాగంగా చూపాల్సిందే.

పన్ను మిన‌హాయింపుల‌ను అందించే అల‌వెన్సులైన హెచ్ఆర్ఏ, మెడిక‌ల్ రీయింబ‌ర్స్‌మెంట్‌, ఎల్‌టీఏ లాంటివాటిని మిన‌హాయింపుల కింద‌ చేర్చారో లేదో ఫారంలో గమనించాలి.చివ‌రి నిమిషంలో వీటికి సంబంధించిన ప‌త్రాలు సమ‌ర్పించ‌డంలో ఫారం 16లో పొర‌పాట్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది.

ఎల్.ఐ.సీ, ఆరోగ్య బీమా ప్రీమియంలు, గృహ‌రుణ చెల్లింపు, విద్యారుణంపై వ‌డ్డీ, పిల్ల‌ల పాఠ‌శాల ఫీజుల లాంటివాటిపై ఎంత మిన‌హాయింపులున్నాయో ఫారం 16లో అవి స‌రిగా న‌మోద‌య్యాయో లేదో గ‌మ‌నించాలి.ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఫైలింగ్ చేసేట‌ప్పుడు ఈ ఫారం 16లోని అంకెల‌నే చార్ట‌ర్డ్ అకౌంటెంట్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

ఫారం 16లో ఏమైనా పొర‌పాట్లు గ‌మ‌నిస్తే యాజ‌మానిని సంప్ర‌దించి వెంట‌నే స‌వ‌ర‌ణ చేయాల్సిందిగా అభ్య‌ర్థించాలి.

ఇప్ప‌టిదాకా వివ‌రించిన‌ అంశాల‌న్నీ ఐటీ రిట‌ర్నులు దాఖలు చేసేట‌ప్పుడు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఆశిస్తున్నాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube