ప్రస్తుతం వింటర్ సీజన్‌లో ఉన్నాం.ఈ సీజన్‌లో దాదాపు అందరినీ జలుబు కనీసం ఒక్కసారైనా పలకరించే పోతుంది.
ఇక జలుబు వచ్చిందంటే.ఎన్ని మందులు వేసుకున్నా ఖచ్చితంగా ఓ వారం రోజులు మనతోనే ఉంటుంది.
అయితే గతంలో జలుబు చేస్తే.పెద్దగా పట్టించుకునే వారే కాదు.
మందులు వేసుకుని ఆవిరి పడితే తగ్గిపోతుందిలే అని భావించేవారు.కానీ, ప్రస్తుతం పరిస్థితుల్లో జలుబు చేసిదంటే.
ఎక్కడ కరోనా సోకిందా అని తెగ భయపడిపోతున్నారు.అయితే జలుబు చేసినంత మాత్రానా కరోనా వచ్చినట్టు కాదు.
అలా అని జలుబును నిర్లక్ష్యమూ చేయకూడదు.
ముఖ్యంగా జలుబు చేసినప్పుడు.
కొన్ని కొన్ని ఆహారాలకు ఖచ్చితంగా ఉండాలి.లేదంటే, జలుబు మరింత తీవ్రంగా మారి.
వదిలిపెట్టకుండా ఇబ్బంది పెడుతుంది.మరి ఇంతకీ జలుబు చేసినప్పుడు ఏ ఏ ఆహారాలు తీసుకోకూడదు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
జలుబు ఉన్నప్పుడు పాలు, పెరుగు, వెన్న, జున్ను ఇలాంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.ఎందుకంటే, పాల ఉత్పత్తులు కఫాన్ని పెంచేస్తుంది.
దాంతో జలుబు మరింత ఎక్కువ అవుతుంది.

అలాగే పంచదారతో తయారు చేసే స్వీట్లను, చాక్లెట్స్‌ను జలుబు చేసినప్పుడు అస్సలు తినకూడదు.ఎందుకంటే, పంచదారతో తయారు చేసిన ఫుడ్స్ తీసుకున్నప్పుడు.శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తాయి.
దాంతో జలుబు తీవ్రంగా మారడంతో పాటు మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది.ఇక జలుబు చేసినప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ మరియు ఆయిలీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
ఇవి తినడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టడంతో పాటు.బాడీ మెటబాలిజం రేటు కూడా తగ్గిపోతుంది.
దాంతో జలుబు తగ్గానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.అలాగే జలుబు చేసినప్పుడు కాఫీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరాదు.కాఫీలోని కెఫిన్ మరియు అదనపు చక్కెర శ్లేష్మాన్ని పెంచుతుంది.ఫలితంగా జలుబు తీవ్రంగా మారుతుంది.
ఇక వీటితో పాటు మాంసం, గోధుమలు, కోల్డ్ వాటర్, జ్యూసులు, ఆల్కహాల్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.
