ఆరోగ్యంగా జీవించాలి అంటే స్వచ్ఛమైన గాలి, ఆహారం, నిద్ర ఎంత అవసరమో.నీరు కూడా అంతే అవసరం.
అందుకే మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన వనరుల్లో నీరు ఒకటని అంటుంటారు.సరిపడా నీరు తీసుకున్నప్పుడే.
శరీరంలో అవయవాలన్నీ సంక్రమంగా పని చేస్తాయి.అలాగే అనేక జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.
అయితే నీటిని ఎక్కువగా తీసుకోవాలనే ఉద్ధేశంలో.చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తాగుతుంటారు.
కానీ, నీరు తాగడానికీ పలు నియమాలు ఉన్నాయి.
ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు తీసుకున్న వెంటనే నీటిని అస్సలు తాగరాదు.
మరి ఆ ఆహారాలు ఏంటీ.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా తెలిసో, తెలియకో చాలా మంది స్వీట్లు తిన్న వెంటనే నీటిని తాగుతుంటారు.అయితే ఇలా చేయడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి.దాంతో మధుమేహం బారిన పడే అవకాశం ఉంటుంది.అందుకే స్వీట్లు తిన్న అర గంట తర్వాత నీరును తీసుకోవాలి.
ఐస్ క్రీమ్.పిల్లలే కాదు పెద్దలు సైతం ఇష్టంగా తింటుంటారు.అయితే ఐస్ క్రీమ్ తిన్న వెంటనే నీరు త్రాగరాదు.ఐస్ క్రీమ్ తీసుకున్నాక నీరు తాగితే దంత మరియు చిగుళ్ల సమస్యలు తలెత్తుతాయి.
అలాగే పండ్లు తిన్న తర్వాత కొందరు నీరు తాగుతుంటారు.కానీ, ఇలా చేయడం చాలా డేంజర్.పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదని.అలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది.

వేరుశెనగలు తిన్న వెంటనే నీరు సేవించరాదు.వేరుశెనగల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.అందువల్ల, వీటిని తిన్న తర్వాత నీటిని తీసుకుంటే.
శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.మరియు శ్వాస కోశ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
టీ, కాఫీ లేదా ఇతరితర వేడి పానియాలు తిసుకున్న వెంటనే కూడా నీటిని తీసుకోరాదు.వేడి, చల్లటి పదార్థాలు ఒకే సారి తీసుకుంటే.దంత సమస్యలతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి.