శివరాత్రి రోజు ఇలా చేస్తే దరిద్రం వదిలి పుణ్యం వస్తుంది  

Don\'t Do This On Maha Shivaratri -

హిందువులకు శివరాత్రి ప్రత్యేకమైన పండుగ.ఆ రోజు గుడికి వెళ్లి ఉపవాసం ఉండి జాగారం చేస్తారు.

Don't Do This On Maha Shivaratri -

ఇలా చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.చాలా మంది జాగారం అంటే సినిమాలు గడుపుతూ ఉంటారు.

కానీ ఆలా చేయకూడదు.జాగారం చేసే సమయంలో భక్తి మార్గంలో ఉండి దేవుని పారాయణలో గడపాలి.

Don't Do This On Maha Shivaratri -

అయితే శివరాత్రి సమయంలో కొన్ని పనులు చేస్తే పుణ్యం లభిస్తుంది.అలాగే కొన్ని పనులు చేస్తే పాపం కలుగుతుంది.

అందువల్ల ఇప్పుడు శివరాత్రి రోజు ఏ పనులు చేయాలో…ఏ పనులు చేయకూడదో వివరంగా తెలుసుకుందాం.


చేయవల్సిన పనులు
శివరాత్రి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తలస్నానము చేసి పూజ చేసుకొని శివాలయానికి వెళ్లి లింగ దర్శనం చేసుకోవాలి.

ఈ విధంగా శివరాత్రి రోజు లింగ దర్శనం చేసుకుంటే చాలా మంచిది.శివరాత్రి రోజు గుడికి వెళ్లే సమయంలో తెలుపు,పసుపు వంటి లేత రంగు కల దుస్తులను ధరించాలి.శివరాత్రి రోజున శివునికి మారేడు,తెల్ల జిల్లేడు, బిల్వ పత్రాలతో పూజ చేయాలి.ఇవి శివునికి అత్యంత ప్రీతికరమైనవి.

అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.శివునికి జామకాయ నైవేద్యం పెట్టాలి.

శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే శివుని కృపకు పాత్రులు అవుతాం.ఉపవాసం చేయలేని వారు అన్నం తినకుండా కేవలం పండ్లను మాత్రమే తిని చేయవచ్చు.

శివరాత్రి రోజు శివ పురాణం చదివిన,విన్నా చాలా పుణ్యం వస్తుంది.శివరాత్రి రోజు ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే చాలా పుణ్యం వస్తుంది.

చేయకూడని పనులు
మాంసాహారాన్ని,గుడ్డు తినకూడదు.మద్యం సేవించకూడదు.శివరాత్రి రోజు మూగ జీవులకు హాని చేయకూడదు.పగటి సమయంలో నిద్ర పోకూడదు.

అబద్దాలు ఆడకూడదు.పిల్లలను,పెద్దవారిని ఊరికే తిట్టకూడదు.

ఎవరితోనూ గొడవ పడకూడదు.సంసారం చేయకూడదు.

DEVOTIONAL