ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది అమితంగా ఇష్టపడి తాగే పానియాల్లో `టీ` ఒకటి.ముఖ్యంగా ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి టీ కడుపులో పడందే రోజు కూడా గడవదు కొందరికి.
అంతలా టీ కు ఎడిక్ట్ అవుతుంటారు.ఇక మితంగా తీసుకుంటే టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ ఎన్నో జబ్బులను దూరం చేస్తాయి.అలాగే టీలో ఉండే పలు రకాల కాంపౌడ్స్ జీవిత కాలాన్ని కూడా పెంచుతుందని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ.టీని తాగే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.మరి పొరపాట్లు ఏంటీ.వాటి వల్ల వచ్చే సమస్యలు ఏంటీ.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే.
టీ తాగుతూ పకోడీలు, బజ్జీలు ఇలాంటివి తింటుంటారు.కానీ, ఇలా చేయడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
శెనగపిండితో తయారు చేసే ఇటువంటి వంటకాలను టీతో పాటు తీసుకుంటే.శరీరంలో ఉన్న పోషకాలు క్షీణిస్తాయి.ఫలితంగా కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ మరియు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.ఇక డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.
కానీ, టీతో పాటుగా డ్రై ఫ్రూట్స్ లేదా టీ తాగిన వెంటనే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మాత్రం విషంగా మారి స్టమక్ అప్ సెట్, మోషన్స్ వంటి సమస్యలు వస్తాయి.
ఇక చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.
ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్ తింటుంటారు.ఆ వెంటనే ఒక కప్పు టీ తాగేస్తారు.
కానీ, ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు అంటున్నారు.గుడ్డు మరియు టీ కాంబినేషన్ వెంటవెంటనే లేదా ఒకేసారి తీసుకుంటే.
కొన్ని రియాక్షన్స్ వల్ల జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుఫులు చెబుతున్నారు.అందువల్ల, ఈ రెండిటిని తీసుకోవడానికి మధ్య గంట లేదా అరగంట టైమ్ గ్యాప్ ఉండాలని అంటున్నారు.