తెలంగాణలో నిర్వహించబోయే కుల గణన( Caste Census )పై ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) అన్నారు.ఇందుకోసం అన్ని పార్టీల నాయకుల సలహాలు తీసుకుంటామని తెలిపారు.
బలహీనవర్గాల కోసమే తమ ఆలోచన అని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.అలాగే నాటి సమగ్ర సర్వే ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో సమగ్ర సర్వేను బయటపెట్టాలని బీఆర్ఎస్( BRS ) ను కోరుతున్నామని పేర్కొన్నారు.కులగణన తీర్మానంపై రాజకీయాలు చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.







