మా ఇంటికి రాకండి... మీ ఇంటికి రానివ్వకండి అంటూ వినూత్న విధానం ...!

ఇదివరకు కాలంలో మన బంధువులు గాని, స్నేహితులు గాని, పరిచయం ఉన్న వాళ్లు బయట కనబడితే మన ఇంటికి రండి అని ఆహ్వానించడం మామూలే.మనం ఎప్పటినుంచో అతిధి దేవోభవ అనే సాంప్రదాయం పాటిస్తున్నాయి.

 Don't Come To Our House- Don't Come To Your House Is An Innovative Approach, Cor-TeluguStop.com

అయితే ఈ కరోనా పుణ్యమా అని ఇంటికి రమ్మనడం సంగతి పక్కన పెడితే, ఎవరైనా వస్తే అనుమానంతో చూసే పరిస్థితి వచ్చిపడింది.దీనికి కారణం ప్రస్తుతం మహా నగరాల్లో ఉండే కరోనా కేసులే.

తాజాగా హైదరాబాద్ లోని ఓ కాలనీవాసులు ఎటువంటి మొహమాటం పడకుండా నిర్మొహమాటంగా ” మా ఇంటికి రాకండి – మీ ఇంటికి రానివ్వకండి “ అంటూ బ్యానర్లు వేసి మరి చెబుతున్నారు.ఇలా చేయడం తప్పని వారికి తెలిసిన కానీ.

కరోనా నేపథ్యంలో సెల్ఫ్ లాక్ డౌన్ తప్పదని చెబుతున్నారు.

ఇలాంటి కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైరస్ బారి నుండి తమకు తాము కాపాడుకోవాలనే ఉద్దేశంతో కొందరు పూర్తిగా ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు.

ఒకవేళ ఎవరైనా అనుకోని అతిధులు వచ్చిన భయాందోళనకు గురవుతున్నారు.దీంతో హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్ భొలాక్పూర్ డివిజన్ లోని పద్మశాలి కాలనీ వాసులు వారిని, వారి కుటుంబ సభ్యులు రక్షించుకునేందుకు ఓ వినూత్న ఆలోచన తో కొత్త ఒరవడికి నాంది పలికారు.‘ మా ఇంటికి రాకండి – మీ ఇళ్లకు రానివ్వకండి ‘ అంటూ బ్యానర్లు, బోర్డులు, ఫ్లెక్సీలు కట్టి తమ ఇంటికి వచ్చే ప్రవేశంలో వాటిని ఉంచుతున్నారు.ఈ నిబంధన వారి మిత్రులు, బంధువులు, పరిచయం లేని వ్యక్తులు అందరికీ వర్తిస్తుందని కాలనీవాసులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube