ప్యాకెట్ పాల‌ను మ‌రిగించ‌రాదు... ఎందుకో తెలుసా..? తప్పక తెలుసుకోండి లేదంటే నష్టపోతారు!  

పాలు మ‌న‌కు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించే ఆహారాల జాబితాలో మొద‌టి స్థానంలో ఉంటాయి. పాల‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణ అందుతుంది. పిల్ల‌లు త్వ‌ర‌గా స‌రైన రీతిలో ఎదుగుతారు. అయితే పాల‌ను తాగాలంటే వాటిని ఎవ‌రైనా మ‌రిగించాల్సిందే. దాంతో పాల‌లో ఉండే హానిక‌ర‌మైన బాక్టీరియా న‌శిస్తుంది. కానీ నేటి త‌రుణంలో చాలా మంది ప్యాకెట్ పాల‌ను కూడా మ‌రిగిస్తున్నారు. అయితే నిజానికి అలా చేయ‌రాదు తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ప్యాకెట్ పాల‌ను మ‌రిగించాల్సిన ప‌నిలేదు. సింపుల్‌గా కొంచెం వేడి చేసుకుని ఉప‌యోగిస్తే చాలు. కానీ అది తెలియ‌ని చాలా మంది వాటిని బాగా మ‌రిగిస్తున్నారు. అయితే ప్యాకెట్ పాల‌ను మ‌రిగించాల్సిన అవ‌స‌రం ఎందుకు లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

Don't Boil Packet Milk-

Don't Boil Packet Milk

సాధార‌ణంగా ఏ డెయిరీలో అయినా పాల‌ను అధిక ఉష్ణోగ్ర‌త‌కు మ‌రిగిస్తారు. 161.6 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంప‌రేచ‌ర్‌కు పాల‌ను మ‌రిగించి వెంట‌నే 15 సెకండ్ల‌లోనే చ‌ల్లారుస్తారు. ఇలా చేయడాన్ని పాశ్చ‌రైజేష‌న్ అంటారు. దీని వ‌ల్ల పాల‌లో ఉండే హానికార‌క సాల్మొనెల్లా బాక్టీరియా తొల‌గిపోతుంది. అయితే ఇలా ఒక‌సారి మ‌రిగించాక ఆ పాల‌ను ప్యాక్ చేస్తారు. అనంత‌రం వాటిని మ‌నం మ‌ళ్లీ మ‌రిగిస్తే వాటిల్లో ఉండే పోష‌కాలు నశిస్తాయి. క‌నుక ప్యాకెట్ పాల‌ను మ‌ళ్లీ మ‌రిగించాల్సిన ప‌నిలేదు. కాక‌పోతే చ‌ల్ల‌గా ఉంటాయ‌నుకుంటే కొద్దిగా వేడి చేసి తాగ‌వచ్చు. కానీ మ‌రిగించ‌రాదు.

ఇక ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా గేదెల వ్యాపారుల నుంచి పాల‌ను కొనేవారు మాత్రం ఆ పాల‌ను క‌చ్చితంగా మ‌రిగించాలి. దాంతో ఆ పాలల్లో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా న‌శిస్తుంది. అప్పుడు ఆ పాల‌ను నిర‌భ్యంత‌రంగా వాడుకోవ‌చ్చు. క‌నుక ఇక‌పై ఎవ‌రూ ప్యాకెట్ పాల‌ను మ‌రిగించకండి. ఈ విష‌యాన్ని అంద‌రికీ తెలియ‌జేయండి. అలా చేస్తే ఎంతో విలువైన ఇంధ‌నాన్ని ఆదా చేయ‌వ‌చ్చు.