వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ పంటలపై కూడా దృష్టి సారించాలని తెలిపారు.
పామాయిల్ పంటను ప్రోత్సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.20 లక్షల ఎకరాల్లో పామాయిల్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.చెన్నూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.ఆరు దశాబ్దాల్లో ఏం చేయని వారు ఇప్పుడు ఆరు గ్యారెంటీలతో వస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్ మోసపూరిత హమీలను నమ్మొద్దని సూచించారు.ఢిల్లీ చుట్టూ పైరవీలు చేసే వారు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.24 గంటల కరెంట్ ఎక్కడుందని కోమటిరెడ్డి అంటున్నారన్న మంత్రి కేటీఆర్ చెన్నూరుకు వస్తే కరెంట్ ఎలా వస్తుందో చూపిస్తామని తెలిపారు.