ఆ విషయంలో శక్తిని పెంచుకోవడానికి గాడిద మాంసం అతిగా తింటున్న జనం..!

ఆంధ్రప్రదేశ్‌లో బాగా డిమాండ్‌ ఉన్న జంతువుల్లో గాడిద కూడ చేరింది.ఆవు పాలు, గేదే పాలు, మేక పాల కంటే గాడిద పాలకు ఎక్కువ ధర పలుకుతోంది.

 Ap People Eating Donkey Meat To Increase Sexual Power, Sexual Power, Donkey Meat-TeluguStop.com

చికెన్, మటన్‌ తో పాటు గాడిద మాంసానికీ గిరాకీ ఎక్కువైపోయింది.శారీరక దారుఢ్యానికి గాడిద పాలు, లైంగిక సామర్థ్యం కోసం దాని మాంసం తింటున్నామని ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పుడు చాలామంది చెబుతున్నారు.

అయితే, గాడిద పాలు ఆరోగ్యానికి మంచిదేగానీ, దాని మాంసం లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. గాడిద మాంసం తింటే సెక్స్‌ సామర్థ్యం పెరుగుతుందని, దాని పాలు తాగితే జబ్బులు నయమవుతాయనే నమ్మకం ప్రజల్లో చాలా కాలంగా ఉందని.

ఇటీవల అది మరింత పెరిగిందని ఆ సంస్థ సభ్యులు చెబుతున్నారు.గాడిద మాంసం లైంగిక పటుత్వాన్ని పెంచుతుందని శాస్త్రీయ నిరూపణలు లేనప్పటికీ, వాటి పాలలో విటమిన్లు, ఫ్యాటీ ఆమ్లాలు లాంటివి ఉంటాయని వైద్యులు చెప్తున్నారు.

Telugu Apdonkey, Donkey Meat, Donkey Milk, Energy, Sexual, Latest-Latest News -

గతంలో ముంబయి నుంచి ఏపీకి తరలిస్తున్న 8 గాడిదలను, రెండు రోజుల క్రితం దాచేపల్లిలో 39 గాడిదలను పోలీసులు పట్టుకున్నారు.అయితే ఈ కేసులతో పోలిస్తే అక్రమంగా రవాణా అవుతున్న గాడిదల సంఖ్య అంతకంటే చాలా ఎక్కువేనని జంతు ప్రేమికులు అంటున్నారు.ఒక టీ గ్లాసు అంటే 100 నుంచి 150 మిల్లీ లీటర్ల గాడిద పాలు ప్రాంతాన్ని బట్టి రూ.50 నుంచి రూ.100 వరకూ అమ్ముతున్నారు.వాటి మాంసం కూడా కేజీ రూ.500 నుంచి రూ.700 పలుకుతోంది.కొంతమంది గాడిద పాలు, మాంసంకంటే వాటి అక్రమ రవాణా ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నారు.కొన్ని రాష్ట్రాల్లో గాడిదను 3 వేలు నుంచి 5 వేల మధ్య కొనుగోలు చేసి, మరో రాష్ట్రంలో దానినే రూ.15 వేల నుంచి రూ.20 వేలకు అమ్ముతున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube