పూర్వీకుల ఆత్మశాంతి కోసం పితృ పక్షాలలో ఏ వస్తువులు దానం చేయాలో తెలుసా?

ఈ ఏడాది పితృ పక్షాలు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.ఈ రోజు నుంచి 15 రోజులను పితృ పక్షాలు అంటారు.

 What Should We Donate On Pitru Pakshalu, Pitru Pakshalu, Significance Of Pitru P-TeluguStop.com

ఈ పదిహేను రోజులలో మన పూర్వీకులకు మన పెద్ద వారి ఆత్మ శాంతించాలని వారికోసం ఒక రోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వారికి తర్పణం వదలడం వల్ల మనపై ఏ విధమైనటువంటి పితృ దోషాలు ఉండవు.అదేవిధంగా పూర్వీకులకు తర్పణలు వదిలి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ఎంతో శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే….

నల్ల నువ్వులు:

Telugu Donate, Jaggery, Jaggery Salt, Pitru Paksha, Pitru Pakshalu, Pitrupakshal

మన పెద్ద వారికి తర్పణం వదిలిన రోజు ఇతరులకు నువ్వులను దైవభక్తితో దానం చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా విపత్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోబడతామని పండితులు చెబుతున్నారు.అందుకోసమే తర్పణం వదిలే సమయంలో కూడా అన్నంలో నల్లనువ్వులను కలుపుతారు.

వెండి వస్తువులు:

Telugu Donate, Jaggery, Jaggery Salt, Pitru Paksha, Pitru Pakshalu, Pitrupakshal

మన పెద్దలకు తర్పణం వదిలిన రోజు ఏ చిన్నపాటి వెండి వస్తువునైనా ఇతరులకు దానం చేయడం వల్ల మన పూర్వీకులకు ఆత్మశాంతి కలిగి వారి ఆశీస్సులు మనపై ఉంటాయి.వెండి చంద్రునికి సంబంధించినది కనుక శ్రాద్ధలో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడం కోసం వెండిని దానం చేయాలని చెబుతారు.

వస్త్రాలు:

Telugu Donate, Jaggery, Jaggery Salt, Pitru Paksha, Pitru Pakshalu, Pitrupakshal

పితృ పక్షాలు సమయంలో మన పూర్వీకులకు తర్పణం వదిలిన రోజు వస్త్రాలను దానం చేయడం ఎంతో శుభసూచకం.మన పూర్వీకుల పేరిట వస్త్ర దానం చేయడం వల్ల పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు.

బెల్లం, ఉప్పు:

Telugu Donate, Jaggery, Jaggery Salt, Pitru Paksha, Pitru Pakshalu, Pitrupakshal

శ్రాద్ధ సమయంలో బెల్లం ఉప్పు దానం చేయటం వల్ల పూర్వీకులు సంతోషపడి మన ఇంటిలో ఏ విధమైనటువంటి కష్టాలు బాధలు లేకుండా తొలగిపోతాయి.అదేవిధంగా పితృ దోషాలు సైతం తొలగిపోయి ఎంతో సంతోషంగా గడుపుతాము.ఇలా కష్ట సమయాలలో వస్తువులను దానం చేయటం వల్ల ఈ కష్టాల సుడిగుండంలో నుంచి బయటపడతారని పండితులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube