రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వారు పిఎమ్ కేర్స్ కు 500 ఇవ్వాలి..!

కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.ఇప్పటికే దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికి కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.

 Give 500 Rs To Pm Cares Fund Says Culture Minister Usha Thakur, Mp Minister Usha-TeluguStop.com

ఈ క్రమంలో రెండు వ్యాక్సిన్లు ఫ్రీగా తీసుకున్న వారు తాము ఇవ్వగలిగే సామర్ధ్యం బట్టి పీ.ఎం కేర్స్ ఫండ్ కు విరాళం ఇవ్వాలని అంటున్నారు మధ్యప్రదేశ్ సాంస్క్రుతిక మంత్రి ఉషా ఠాకూర్.సామర్ధ్యం ఉంటే రెండు టీకాలు ఉచితంగా తీసుకున్న వారు 500 రూపాయలు పీ.ఎం ఫండ్ కు విరాళంగా అందించాలని అన్నారు ఉషా ఠాకూర్.భగవంతుడు మనకు సాయం చేయగలిగే సామర్ధ్యాన్ని ఇస్తే అందరం తప్పకుండా సాయం చేద్దామని ప్రజలను కోరారు.ఒక్క డోస్ ఖరీదు 250 రెండు డోసులు వేసుకున్న వారు 500 రూ.లు పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా ఇవ్వాలని ఆమె చెప్పారు.

వ్యాక్సిన్ తయారీ దారుల నుండి ప్రభుత్వం 75 శాతం టీకాలు తీసుకుంటుంది.

ప్రైవేట్ హాస్పిటల్స్ కు 25 శాతం టీకాలు కేటాయించారు.ప్రైవేట్ హాస్పిటల్స్ లో వేసే టీకాలకు ప్రభుత్వం ధరలను నిర్ణయించింది.

ప్రస్తుతం మన దగ్గర మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి కొవిషీల్డ్ 780, కొవాగ్జిన్ 1410, స్పుత్నిక్ వి 1145 రూ.లుగా ప్రభుత్వం నిర్ణయించింది.ప్రజలు మాత్రం ప్రభుత్వం అందించే వ్యాక్సిన్ సెంటర్లలోనే వ్యాక్సిన్ వేసుకుంటున్నారు.ప్రైవేట్ హాస్పిటల్స్ లో తక్కువగా టీకా ప్రోగ్రాం జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube