పదిరోజుల గడువున్నా ముందే ఓటేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆ దేశాధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా.

 Donald Trump Votes Early In Florida In Us Presidential Election, Donald Trump, U-TeluguStop.com

శనివారమే ఓటువేశారు.ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.

ఓటు వేసేటప్పుడు మాస్క్‌ ధరించిన ట్రంప్‌.విలేకర్ల వద్దకు వచ్చినప్పుడు దాన్ని తీసివేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.‘‘ ట్రంప్ అనే వ్యక్తికి నేను ఓటు వేశాను ’’ అని చిరునవ్వులు చిందుస్తూ విలేకర్లకు చెప్పారు.

పోలింగ్ తేదీ కంటే ముందుగానే ఓటు వేసేందుకు అమెరికా సహా పలు దేశాల్లో అనుమతి వున్నది.నేరుగా గానీ, లేదా పోస్టల్ ద్వారా గానీ ముందుగానే ఓటు వేయవచ్చు.

రద్దీని నియంత్రించేందుకు, పోలింగ్ తేదీల్లో అందుబాటులో ఉండని వారి కోసం ఈ వెసులుబాటు కల్పించారు.

కాగా, ఫ్లోరిడాలో ట్రంప్‌కు ఇల్లు ఉంది.

గతేడాది ఆయన న్యూయార్క్ నుంచి ఇక్కడికి మకాం మార్చారు.మరోవైపు అమెరికాలో కరోనా నేపథ్యంలో ఇప్పటికే 55 మిలియన్ల మంది ఓటు వేసేవారు.

ట్రంప్ రెండోసారి పోటీ చేస్తున్నారు.ఆయనపై డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ పోటీ చేస్తున్నారు.

వారిద్దరి మధ్య ఇప్పటికే రెండు డిబేట్లు కూడా జరిగాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత సుదీర్ఘంగా సాగే ప్రక్రియ.

అక్కడ అధికారం రిపబ్లికన్లు, డెమొక్రాట్లదే.ఈ రెండు పార్టీలు అభ్యర్ధిని ఎంపిక చేయడం దగ్గర్నుంచి ప్రతీ దశ ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుంది.

వాస్తవానికి ప్రజలు అధ్యక్షుడిగా నేరుగా ఓటు వెయ్యరు.వారు నివసించే రాష్ట్రంలో రిపబ్లికన్‌ లేదంటే డెమొక్రాటిక్‌ పార్టీ ఎలక్టోరల్‌కు ఓటు వేస్తారు.

నాలుగేళ్లకి ఒకసారి జరిగే అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ నెలలో మొదటి సోమవారం మర్నాడు వచ్చే మంగళవారం నిర్వహిస్తారు.ఈ ఏడాది నవంబర్‌ 3న ఎన్నికలు జరగనున్నాయి.అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయసభలకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.435 మంది సభ్యులుండే సర్వ ప్రతినిధి సభకి రెండేళ్లకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు ఓ సారి, ఆ తర్వాత రెండేళ్లకి మరోసారి జరుగుతాయి.ఇక కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్‌లో 100 స్థానాలున్నా యి.వీటిలో 33 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి.వీరి పదవీకాలం ఆరేళ్లు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube