ట్రంప్ భారీ ర్యాలీ...ఇంత జరిగినా సిగ్గు రాలేదా..చిచ్ఛీ..!!

చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామిత ఊరకే రాలేదు, కొంతమంది వ్యక్తుల స్వభావాన్ని బట్టి ఇలాంటి సామెతలు పుట్టుకొస్తాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి సరిగ్గా ఈ సామెత సూటవుతుంది.

 Donald Trump Plans Wild Protest Rally In Washington, Washington, Wild Protest Ra-TeluguStop.com

గడిచిన ఎన్నికల్లో ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుని, అమెరికా ప్రజలచే తిరస్కరించబడిన డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ తాను ఓడిపోలేదని వాదన చేస్తూనే ఉన్నారు.త్వరలో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో కూడా ట్రంప్ గెలుపు నాదేనని చెప్పుకోవడం, తనవద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నయాని చెప్పడం ట్రంప్ కు టెంపరి తనం ఏ స్థాయిలో ఉందొ అర్థమవుతుంది…ఇదిలాఉంటే


ట్రంప్ మరో సారి కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్దంగా ఉన్నారట.

గతంలో తన ఓటమిని సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించినా సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టులు ఆ ఫిర్యాదులను కొట్టేశాయి తాజాగా మరో సారి ట్రంప్ తన వద్దా పక్కా ఆధారాలు ఉన్నాయని, వాటితో మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు.అంతేకాదు అమెరికాలో తన మద్దతు దారులతో భారీ నిరసన ర్యాలీ ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు.

జనవరి 6 వ తేదీన అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ట్రంప్ భారీ ర్యాలీ కి సిద్దమవుతున్నారు.

తన ఓటమిని అమెరికా ప్రజలు అంగీకరించడం లేదని, తన అభిమానులు పోరాటానికైనా సిద్దం అంటున్నారని ఈ క్రమంలో తన అభిమానులు, మద్దతు దారులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టనున్నానని ట్రంప్ తెలిపారు.

ఉదయం 11 గంటల సమయంలో వాషింగ్టన్ లో నిరసన ర్యాలీ ఉంటుందని తదనంతరం తన వద్ద ఉన్న పక్కా సాక్ష్యాలతో కోర్టును ఆశ్రయిస్తానని ట్వీట్ చేశారు.ఈ విషయంపై స్పందించిన బిడెన్ మద్దతు దారులు, ఓటమి తరువాత ట్రంప్ మానసికంగా కుంగిపోయారని అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని అంటుంటే నెటిజన్లు మాత్రం వీటో అధికారాన్ని తిరస్కరించి అవమానించిన ట్రంప్ కి బుద్దిరాలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube