ఆ భాదితులకి ట్రంప్ అభయహస్తం..!!!   Donald Trump Wants California To Rake Forests To Prevent Fires     2018-11-19   15:56:51  IST  Surya

కొన్నిరోజుల క్రితం అమెరికాలో కాలిఫోర్నియా అడవుల్లో రేగిన కారుచిచ్చి అందరికి గుర్తు ఉండే ఉంటుంది..ఈ అగ్నిప్రమాదం వలన భారీ స్థాయిలో అడవి కాలిపోయింది..అంతేకాదు అడవిలో జంతువులు పశు పక్ష్యాదులు లెక్కక్కుమించి చనిపోయాయికూడా..ఈ క్రమంలోనే అక్కడ దాదాపు 1200 మంది అమెరికా పౌరులు కూడా గల్లంతు అయ్యారు..అయితే వీరందరికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భరోసా ఇచ్చారు.

ఈ ఘటన జరగడం ఎంతో భాధాకరం మీకు నేను అండగా ఉంటాను అంటూ అయన భరోసా ఇచ్చారు..బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించడంతో పాటు ప్రభుత్వం తరుపున అందే సాయం ఉంటుందని అన్నారు. కాలిఫోర్నియా గవర్నర్‌ జెర్రీ బ్రౌన్‌తో కలిసి ఆయన క్యాంప్‌ ఫైర్‌, ప్యారడైజ్‌ నగరాల్లో ఆదివారం పర్యటించారు.

Donald Trump Wants California To Rake Forests Prevent Fires-California Wildfires

ఇదిలాఉంటే ఈ దారుణమైన ఘటనలో ఇప్పటికి దాదాపు 76 మంది మృతి చెందగా దాదాపు 1200 మందికి పైగా గల్లంతయ్యారు. పారడైజ్‌ నగరమంతా అగ్నిగుండంగా మారిపోయింది…ఈ ప్రాంతంలో ప్రస్తుతం మరింత ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు సహాయక బృందాలు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.