అధ్యక్షుడిపై కుట్రలు..ప్రజా తీర్పుకి తూట్లు..!!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై డెమోక్రటిక్ పార్టీ ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు ట్రంప్ తరపు లాయర్లు.ఉక్రెయిన్ తో లావాదేవీలు తదితర అక్రమాల ఆరోపణలపై ట్రంప్ అభిశంసన తీర్మానం ఎదుర్కుంటున్న విషయం విధితమే.

 Donald Trump Usa Democratic Republics-TeluguStop.com

డెమోక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న జో బిడెన్ పై పరాయి దేశాన్ని ఉపయోగిస్తూ అనేక రకాలుగా అవినీతి వ్యక్తిగా చేయాలంటూ ఒత్తిళ్ళు తెచ్చిన ట్రంప్ అనూగ్యంగా ఆ విషయం బయటకి పొక్కడంతో ఒక్క సారిగా అభిశంసన ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ క్రమంలోనే ట్రంప్ లాయర్లు ఇదంతా ట్రంప్ ని రాజకీయంగా ఎదుర్కోవడానికి చేస్తున్న కుట్రగా అభివర్ణించారు.

రాజకీయ లబ్ది కోసం, రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ని దెబ్బ కొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలని తెలిపారు.ప్రజలు 2016 లో ఇచ్చిన తీర్పుకి విరుద్దంగా డెమోక్రటిక్ పార్టీ ప్రవర్తిస్తోందని, ప్రజలు సైతం డెమోక్రటిక్ పార్టీ నేతల తీరుపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

Telugu American, Democratic, Donald Trump, Republics, Telugu Nri Ups-

అమెరికా చరిత్రలోనే ఈ విధంగా ప్రజా తీర్పుని సవాలు చేస్తూ ప్రయత్నాలు చేయడం మొదటిసారని వ్యాఖ్యానించారు.డెమోక్రటిక్ పార్టీ చేస్తున్న ఈ కుట్రల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సఫలం కానివ్వమని వైట్ హౌస్ కౌన్సిల్ పాత సిపోలిన్ ప్రకటించారు.చట్టసభలో సైతం ట్రంప్ లీగల్ బృందం బలమైన వాదనలు వినిపించింది.మరి ట్రంప్ ని ఒడ్డిన పడేసే ప్రయత్నాలు సఫలం అవుతాయో లేదో వేచి చూడాల్సిందే అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube