ట్రంప్ ఎఫెక్ట్ : అమెరికాలో వికటించిన సొంత వైద్యం...!!!  

Donald Trump Us Chloroquine Man Died - Telugu Chloroquine, Covid19, Donald Trump

ప్రపంచ వ్యాప్తంగా కరోనా అందరిని కంగారు పెట్టిస్తోంది.ఒకరి , ఇద్దరు, వందలు కాదు ఏకంగా వేల సంఖ్యలో ప్రజలు మృత్యు వాత పడుతున్నారు.

 Donald Trump Us Chloroquine Man Died - Telugu Chloroquine, Covid19, Donald Trump-Telugu NRI-Telugu Tollywood Photo Image

కరోనా ధాటికి అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.అమెరికాలో ఇప్పటికే మృతుల సంఖ్య 500 దాటేసింది.

వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు చేసిన ఓ ప్రకటన ఇద్దరు దంపతుల ప్రాణాలు పోయేలా చేసింది.

ట్రంప్ ఎఫెక్ట్ : అమెరికాలో వికటించిన సొంత వైద్యం… - Donald Trump Us Chloroquine Man Died - Telugu Chloroquine, Covid19, Donald Trump-Telugu NRI-Telugu Tollywood Photo Image

క్లినికల్ గా పూర్తి ఆధారాలు లేకుండా ట్రంప్ చెప్పాడు కదా అని అమెరికాలోని ఆరిజోనాలో మేరీకోపా కౌంటీ కి చెందిన 60 ఏళ్ళు పైబడిన ఇద్దరు దంపతులు క్లోరోక్విన్ టాబ్లెట్లు వాడేశారు.కొన్ని రోజుల క్రితం ట్రంప్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో మాట్లాడుతూ క్లోరోక్విన్ కరోనాని కంట్రోల్ చేసే శక్తి ఉందని ప్రకటించారు.

మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఆ దంపతులు కరోనా లేకపోయునా భయపడి ఆ టాబ్లెట్లు తెప్పించుకుని వేసుకున్నారు…
వాళ్ళు ఆ మెడిసిన్ వేసుకున్న కొంత సేపటికి తల తిరగడం వాంతులు,విరోచనాలు వచ్చి కుప్పకూలిపోయారని, భర్త గుండె పోటుతో అక్కడికక్కడే మృతి చెందగా భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని ఆమె కోలుకునే అవకాశాలు ఉన్నారని వైద్యులు తెలిపారు.దాంతో స్పందించిన ప్రభుత్వం సొంత వైద్యాలు చేసుకోవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

కేవలం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చే సూచనల మేరకు మందులు వాడాలి తప్ప సొంత ప్రయోగాలు చేస్తే ఇలాంటి దారుణాలు జరుగుతాయని తెలిపారు.దాంతో నెటిజన్లు అందరూ ట్రంప్ వలనే ఆ దంపతులకి ఇంతటి ఘోరం జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు

Donald Trump Us Chloroquine Man Died Related Telugu News,Photos/Pics,Images..