ట్రంప్ కి షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విట్టర్..!!  

Donald trump, twitter shock, Tweets, Twitter deleted Trump Post - Telugu Donald Trump, Tweets, Twitter Deleted Trump Post, Twitter Shock

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి టైం అస్సలు బాలేదనే చెప్పాలి.కొందరు అదృష్టవంతులకి ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది.

 Donald Trump Twitter Shock

కొందరు దురదృష్టవంతులకి మాత్రం బంగారం పట్టుకుంటే మట్టై పోతూ ఉంటుంది.ప్రస్తుతం ట్రంప్ ఈ కోవలోకే వస్తాడు.

ట్రంప్ ఏది చేసినా రివర్స్ లో తనకి మైనస్ అవ్వడమే కాకుండా పరువు పోగొట్టుకుంటున్నారు.గడించిన కొంత కాలంగా ట్రంప్ వ్యవహార శైలిలో విభిన్నమైన మార్పులు వస్తున్న నేపధ్యంలో ఆయన మానసిక పరిస్థితిపై కొందరు సందేహాలు కూడా వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ట్రంప్ కి షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విట్టర్..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ట్రంప్ ఏమి చేసినా అదో సెన్సేషన్ అవుతుంది.ఒక్కో సారి ట్రంప్ చేసే పనులు పుండు మీద కారం చల్లేలా ఉంటే మరొక సారి నవ్వులు పూయిస్తాయి.

తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ట్రంప్ కి ట్విట్టర్ కూడా మధ్య మధ్యలో షాకులు ఇస్తూనే ఉంటుంది.ట్రంప్ తప్పుడు ట్వీట్ చేసిన ప్రతీ సారి ఇలాంటి విషయంలో మేము సహించము ఇకపై ఇలా చేయద్దు అంటూ పలు సందర్భాలలో ట్రంప్ ట్వీట్ లను ట్విట్టర్ తొలగించింది.

ట్రంప్ కూడా ట్విట్టర్ పై గుర్రుగా ఉంటుండేవారు.ఇదిలాఉంటే

తాజాగా ట్రంప్ చేసిన ట్వీట్ పై ట్విట్టర్ మరో సారి స్పందించింది.

ట్రంప్ పోస్ట్ చేసిన ఫోటో ని తొలగించింది.ట్రంప్ పోస్ట్ చేసిన ఫోటో కి కాపీ రైట్స్ సమస్య ఉండటంతోనే ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలిపింది.

ట్రంప్ గతంలో ఓ పోస్ట్ ని పోస్ట్ చేశారు.ఆ పోస్ట్ లో ట్రంప్ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో ఉంది.

ఈ ఫోటోని గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉన్నప్పుడు న్యూయార్క్ టైమ్స్ ఫోటో గ్రాఫర్ పోటో తీశారు.ఆ ఫోటో కి కాపీ రైట్స్ ఉండటంతో ట్విట్టర్ దానిని తొలగించింది.

అయితే ప్రతీ సారి ట్రంప్ ట్వీట్ లు తొలగించిన సందర్భంలో చిర్రుబుర్రులాడే ట్రంప్ ఈసారి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

#Tweets #Twitter Shock #Donald Trump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Donald Trump Twitter Shock Related Telugu News,Photos/Pics,Images..