వలసదారులపై కొరడా: హోండురాస్‌తో ట్రంప్ సర్కార్ ఒప్పందం, ఇక బహిష్కరణే

అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ట్రంప్ సర్కార్ అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటోంది.ఈ క్రమంలో హోండురాస్ దేశస్థులను బహిష్కరించడానికి ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.

 Donald Trump Trump Administration Signs Deal To Deport Migrants To Honduras-TeluguStop.com

ఈ ఒప్పందం ప్రకారం హోండురాస్ శరణార్థులను అమెరికా దక్షిణ సరిహద్దు నుంచి బయటకు పంపిస్తుంది.ఇప్పటికే గ్వాటెమాలా మరియు ఈఐ సాల్వాడర్‌లతో అమెరికా ఇదే తరహా ఒప్పందాలను కుదుర్చుకుంది.

Telugu Deal Deport, Donald Trump, America, Telugu Nri Ups-

 అయితే ప్రపంచంలోనే అత్యధిక హత్యల శాతంతో పాటు హింస, పేదరికంతో అల్లాడుతున్న హోండురాస్‌కు వలసదారులను తిరిగి పంపించడం అంత శ్రేయస్కరం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అమెరికా-మెక్సికో సరిహద్దుల గుండా ప్రవేశిస్తున్న వలసదారుల సంఖ్యను తగ్గించాలని కృతనిశ్చయంతో ఉన్నారు.

మెక్సికో తర్వాత మధ్య అమెరికా దేశాలైన హోండురాస్, గ్వాటెమాలా, ఈఐ సాల్వడార్ల నుంచి పెద్ద సంఖ్యలో శరణార్ధులు అమెరికాలో ఆశ్రయం పొందేందుకు తరలివస్తున్నారు.దీనిని కట్టడి చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఒప్పందాలను కుదర్చుకుంది.

అయితే వీటికి చట్టసభలో అనుమతితో పాటు న్యాయపరంగా ఎన్నో సంక్షిష్ట దశలను దాటాల్సి ఉంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాగా ఈ నెల ప్రారంభంలో అమెరికాలో ఆశ్రయం పొందేందుకు వస్తున్న వలసదారులను దక్షిణ సరిహద్దుల్లో ఆపివేయాల్సిందిగా ఫెడరల్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో ఆగస్టు నాటికి 8,11,016 మంది వలసదారులను హోమ్ లాండ్ సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.వీరిలో 5,90,000 మంది ఈఐ సాల్వాడర్, గ్వాటెమాలా, హోండురాస్‌కు చెందినవారు కావడం గమనార్హం.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube