క్యాపిటల్ భవనంపై దాడి : స్వయంగా డ్రైవింగ్‌కు సిద్ధపడ్డ ట్రంప్.. మాజీ సహాయకురాలి వాంగ్మూలం

జనవరి 6, 2021న క్యాపిటల్ హిల్ పై దాడి ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అనేక దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.ఆ రోజున క్యాపిటల్ భవనానికి వెళ్లేందుకు భద్రతా సిబ్బంది నిరాకరించడంతో ఆగ్రహించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తన కారు డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించారని వైట్ హౌస్ లో మాజీ సహాయకురాలు కాసిడీ హచిన్ సన్ ఇచ్చిన వాంగ్మూలం అమెరికన్ రాజకీయాల్లో కలరేపుతోంది.2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ధ్రువీకరించబడిన రోజున యూఎస్ క్యాపిటల్ పై జరిగిన దాడిపై దర్యాప్తు చేస్తున్న హౌస్ కమిటీకి మంగళవారం హచిన్ సన్ వాంగ్మూలాన్ని అందించారు.

 Donald Trump Tried To Grab Steering Wheel To Go To Us Capitol On January 6, 2021-TeluguStop.com

ఆ రోజున క్యాపిటల్ హిల్ కు వెళ్లడం గురించి ట్రంప్, వైట్ హౌస్ సిబ్బందితో చర్చిస్తున్నారని హచిన్ సన్ చెప్పారు.ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించే హౌస్ ఛాంబర్ సహా వైట్ హౌస్ న్యాయవాది పాట్ సిపోలోన్ లు .అక్కడికి వెళ్లవద్దని ట్రంప్ ను కోరినట్లు హచిన్ సన్ పేర్కొన్నారు.ట్రంప్ తన మద్ధతుదారులతో కలిసి క్యాపిటల్ హిల్ కు వెళితే.

న్యాయాన్ని అడ్డుకోవడం, ఎన్నికల గణన చట్టాన్ని మోసం చేయడం వంటి నేరాలకు పాల్పడటమేనని సిపోలోన్ తనతో చెప్పారని హచిన్ సన్ వాంగ్మూలంలో వెల్లడించారు.హౌస్ రిపబ్లికన్ లీడర్ కెవిన్ మెక్ కార్తీ కూడా తనకు ఫోన్ చేశారని.

క్యాపిటల్ కు వచ్చే పనిలో ట్రంప్ వున్నట్లు తాను ఆయనకు తెలియజేసినట్లు ఆమె పేర్కొన్నారు.దాంతో ఆయన క్యాపిటల్ కు రావొద్దని సూచించినట్లు వాంగ్మూలం ఇచ్చారు.

Telugu Donald Trump, Electoral Votes, Joe Biden, Pat Cipollone, Capitol, Congres

కాగా.అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం 2021 జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని మరి వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.

వారిని శాంతింపజేసేందుకు భద్రతా దళాలు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలింది.గతంలో ఏ అధ్యక్షుడికి రానంత అప్రతిష్టను ట్రంప్ మూట కట్టుకోవాల్సి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube