ట్రంప్ యూ టర్న్…!!!  

Donald Trump wants the US elections to be postponed, Donald Trump, Trump Twitter, Democratic Party, Republican Party - Telugu Democratic Party, Donald Trump, Donald Trump Wants The Us Elections To Be Postponed, Republican Party, Trump Twitter

అమెరికా అధ్యక్ష ఎన్నికలకి సమయం దగ్గరపడుతోంది.నవంబర్ 3వ తేదీన ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో ఇరు పార్టీలు విజయావకాశాలపై దృష్టి సారిస్తున్నాయి.

 Donald Trump To Postpone Elections

ఒక పక్క కరోనా తెచ్చిన నష్టాన్ని ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ రిపబ్లికన్ పార్టీని ప్రజా వ్యతిరేకత పార్టీగా అభివర్ణిస్తూ ప్రచారంలో దూసుకుపోతోంది డెమోక్రటిక్ పార్టీ.మరో పక్క అధికార పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ కరోనా సమయంలో ప్రభుత్వం అందించిన సేవలు, ప్రజలని ఎలా అప్రమత్తం చేశామో, వలసవాసులని అమెరికాలోకి రానివ్వకుండా అమెరికన్స్ కి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ఎలాంటి పనులు చేపట్టారు అనే విషయాల్ని చెప్తూ, కరోనా సమయంలో చేపట్టిన ఉద్దీపన చర్యలు ప్రస్తావిస్తూ హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తోంది.

ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీలో ఆందోళన కలిగిస్తున్నాయి.

ట్రంప్ యూ టర్న్…-Telugu NRI-Telugu Tollywood Photo Image

ట్విట్టర్ వేదికగా ట్రంప్ నిన్నటి రోజున అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ప్రకటించడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

తన గెలుపు కష్టమని భావించిన ట్రంప్ ఈ విధంగా ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నారు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమ జరిగింది.ట్రంప్ వ్యతిరేకులు అందరూ ఒక్క సారిగా ట్రంప్ భయపడ్డారు, ఓటమిని ఒప్పుకున్నారు అంటూ కామెంట్స్ చేశారు.

ట్రంప్ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలు సైతం వ్యతిరేకించారు.ఈ పరిణామాల నేపధ్యంలో ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారు.

ఎన్నికలు వాయిదా వేయాలని ప్రకటించిన 24 గంటల్లోనే తూచ్ నేను అలా అనలేదు నా ఉద్దేశ్యం అది కాదు ఎన్నికలు సజావుగా జరగాలని కోరుకుంటున్నాను అంటూ మళ్ళీ రీ ట్వీట్ చేశారు.దాంతో కేవలం గంటల వ్యవధిలోనే ట్రంప్ మాటలు మార్చేశారని, అబద్దాలు చెప్పడంలో ట్రంప్ ని మించిన వారు లేరని డెమోక్రటి పార్టీ మండిపడుతోంది.

ఇలాంటి అబద్దాల కోరు నిలకడ లేని వ్యక్తి అధ్యక్షుడిగా కొనసాగకూడదు అంటూ ప్రచారంలో వాడేసుకుకుంటోంది.తాజా పరిణామాలపై స్పందించిన రాజకీయ పరిశీలకులు ట్రంప్ వైఖరి ఇలానే కొనసాగితే రిపబ్లికన్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరగదని ఇప్పటికే పార్టీ ట్రంప్ చేష్టల కారణంగా ఎంతో నష్టపోయిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Donald Trump #Trump Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Donald Trump To Postpone Elections Related Telugu News,Photos/Pics,Images..