అధ్యక్షుడు ట్రంప్ కు కూడా కరోనా టెస్ట్,రిసల్ట్ చూసి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ ను సైతం భయాందోళనకు గురి చేసింది.తాజాగా బ్రెజిల్ ప్రతినిధుల టీం తన ఫ్లోరిడా రిసార్ట్‌కు వచ్చిన సమయంలో ట్రంప్ వారితో కలయదిరిగారు.

 Donald Trump Tests Negative For Coronavirus-TeluguStop.com

అయితే ఆ టీమ్ లో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడం తో ఈ నేపథ్యంలో అధినేత కు కూడా ఈ కరోనా సోకిందా అన్న అనుమానంతో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ట్రంప్ కు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు.అయితే ఈ ఆ రిపోర్ట్స్ లో నెగిటివ్ అన్నట్లుగా రిజల్డ్ రావడం తో వైట్ హౌస్ ప్రతినిధులు ఊపిరిపీల్చుకున్నారు.

చైనా లో మొదలైన ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఐదువేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.లక్షన్నరకు పైగా.

దీని బారినపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.సామాన్య ప్రజానికాన్నే కాదు.

ఏకంగా సెలబ్రిటీలను, రాజకీయ నేతల్ని సైతం వణికిస్తున్న ఈ వైరస్ ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, పలు దేశాల రాజకీయ నేతలు కూడా దీని బారిన పడ్డారు.తాజాగా అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్‌‌కు కూడా కరోనా భయం పట్టుకుంది.

దీంతో వెంటనే అధినేత కు కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు.అయితే పరీక్షల్లో కరోనా వైరస్‌ నెగెటివ్‌ వచ్చినట్టు ఆయన వైద్యులు తెలిపారు.

ఇటీవల పలువురు దేశాధినేతలు సైతం కరోనా బారిన పడుతుండడం తో అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యల్లో భాగంగా ట్రంప్ కు కూడా కరోనా టెస్ట్ లు చేసినట్లు తెలుస్తుంది.అయితే ఆయనకు నెగిటివ్ రిజల్డ్ రావడం తో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

కరోనా సోకి ఇప్పటికీ అమెరికాలో 51 మంది మరణించడం తో లక్షలాది మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.

మరోవైపు యూరప్ దేశాల ప్రజలు అమెరికాలో అడుగు పెట్టొద్దంటూ ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది.అయితే ఈ నిషేధం తాజాగా బ్రిటన్, ఐర్లాండ్‌కు వర్తిస్తుందంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించారు.

అంతేకాకుండా దేశీయంగా కూడా ప్రయాణాలపై ఆంక్షలు విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.అవసరమైతే తప్ప ప్రయాణం చేయద్దంటూ ట్రంప్ ఇటీవలే ప్రజలకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube