ట్రంప్ ట్రాక్ రికార్డ్...18 సభలు..30వేల కేసులు..700ల మరణాలు..!!

అమెరికా అధ్యక్షుడు ట్రాక్ రికార్డ్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.ఎన్నికలు కొన్ని గంటల వ్యవధిలో జరగనున్న నేపధ్యంలో తాజాగా ట్రంప్ కారణంగా అంటూ వస్తున్న ఈ వార్తలు ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

 18 Trump Rallies Have Led To 30,000 Covid-19 Cases, Elections Campaign, Donald T-TeluguStop.com

అధ్యక్షుడి ట్రాక్ రికార్డ్ ఇదిగో అంటూ సోషల్ మీడియాలో ట్రంప్ పై వ్యతిరేక పోస్టులు వస్తున్నాయి .ట్రంప్ తన ఎన్నికల ప్రచారం కోసం తన వెంట వున్న మద్దతు దారులకు తీవ్రమైన నష్టాన్ని చేకూర్చారని విమర్శలు చేస్తున్నారు.స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వే ఇప్పుడు ట్రంప్ కు అతి పెద్ద తలనెప్పిగా మారింది.వివరాలలోకి వెళ్తే.

ట్రంప్ అధ్యక్ష ఎన్నికలలో భాగంగా జూన్ -2020 నుండీ సెప్టెంబర్ -2020 వరకూ నిర్వహించిన సభల్లో దాదాపు 30వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారని, దాదాపు 700 మందికి పైగా అమెరికన్స్ చనిపోయారని యూనివర్సిటీ తన సర్వే వివరాలు బయటపెట్టింది.దాంతో ఈ సర్వే సారాంశాన్ని బిడెన్ తనకు అనుకూలంగా మలచుకున్నారు.

ట్రంప్ మిమ్మల్ని ఏ మాత్రం కూడా పట్టించుకోలేదని చెప్పడానికి ఇంతకు మించి సాక్ష్యాలు అవసరం లేదని అనుకుంటున్నానని తెలిపారు.

ప్రజారోగ్య సంస్థలు ట్రంప్ కు ఎన్నో సార్లు హెచ్చరికలు చేశాయని, కానీ ట్రంప్ అవేమి పట్టనట్టుగా వ్యవహరించారని ఆరోపించారు బిడెన్.

మాస్క్ ధరించే విషయంలో ప్రజలకు ఆదేశాలు ఇవ్వాల్సిన అధ్యక్షుడు తానే మాస్క్ ధరించకుండా ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి కారణంగానే ప్రస్తుతం ఎంతో మంది అమెరికన్స్ బలై పోయారని బిడెన్ విమర్శలు ఎక్కుపెట్టారు.ఈ అధ్యక్షుడు అసలు ఏ మాత్రం అమెరికన్స్ పై ప్రేమ చూపలేదు స్వార్ధానికి కేవలం ఎన్నికల కోసం ఎంతో మందిని బలి తీసుకున్నాడంటూ బిడెన్ మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube