ఫ్లూ పేరు చెప్పి ఫూల్ అయిన ట్రంప్...అతి తెలివికి మరో నిదర్శనం..!!!

ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు.చిన్నప్పుడు చదువుకున్న నీతి స్కూక్తులు మనకి సందర్భాను సారంగా గుర్తుకు వస్తుంటాయి.

 Trump Falsely Claims 1918 Flu Pandemic Ended Wwii, Donald Trump, Spanish Flu, Se-TeluguStop.com

ఇప్పుడు ఏ సందర్భం వచ్చిందని గుర్తుకు వచ్చింది అనుకుంటున్నారా ఇంకేముందు ట్రంప్ తెలివి తేటలని గుర్తు చేసుకుంటే ఇలాంటి సూక్తులు ఒకటి కాదు వరుసగా గుర్తుకు వస్తూనే ఉంటాయి.మనం చెప్పే మాటల్లో చేతల్లో క్లారిటీ తప్పకండా ఉండాలి అప్పుడే సమాజంలో మనకంటూ గౌరవం, మర్యాద ఉంటాయి.

మరో అలాంటిది అగ్ర రాజ్యానికి అధ్యక్షుడు ఏ స్థాయిలో హుందాగా ఉండాలి.మాట్లాడే ప్రతీ మాట ఆచి తూచి మాట్లాడాలి లేదంటే నవ్వులు పాలు అవ్వక తప్పదు.

తాజాగా ట్రంప్ విషయంలో ఇదే జరిగింది.

ట్రంప్ సహజంగానే తెలియని విషయాన్ని తెలిసినట్టుగా ఎంతో హుందాగా ప్రకటించేసి ఫూల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1917 లో వచ్చిన స్పానిష్ ఫ్లూ వలన రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది దానివలన ఎంతో మంది సైనికులు వ్యాధి బారిన పడి మృతి చెందారు దాదాపు 50 లక్షలు నుంచీ కోటి మంది వరకూ ప్రాణాలు కోల్పోయారని ప్రకటించారు.కానీ వాస్తవానికి

రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచీ 1945 వరకూ జరిగింది.

ట్రంప్ చెప్పిన 1917 కి అసలు రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కాలేదు.మొదటి ప్రపంచ యుద్ధం స్పానిష్ ఫ్లూ వచ్చిన 1918 లోనే ముగిసిపోయింది.

కానీ ట్రంప్ 1917 లో వచ్చిన ఫ్లూ కారణంగా యుద్ధం ముగిసినట్టు ప్రకటించారు.స్పానిష్ ఫ్లూ వచ్చింది 1918 లో.ఇదే ఏడాదిలో మొదటి ప్రపంచ యుద్ధం అంతమయ్యింది.ఈ విషయం కాస్తా వైరల్ కావడంతో ట్రంప్ కనీస విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఇది భాద్యతారాహిత్యం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కనపడే సరికి ట్రంప్ వర్గం అలెర్ట్ అయ్యింది మొదటి ప్రపంచ యుద్ధం అనబోయి ట్రంప్ రెండవ ప్రపంచ యుద్ధం అన్నారని ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube