కరోనా వ్యాక్సిన్: అమెరికన్ల తర్వాతే మిగిలిన వారికి.. బుద్ది చూపించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టం.ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు సైతం ట్రంప్ వైఖరిని అర్ధం చేసుకోలేమని చెబుతారు.

 Donald Trump Signs Executive Order Prioritizing U S For Covid Vaccine, Us Presid-TeluguStop.com

అమెరికాలో కరోనాను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక.ఆయన తల పట్టుకున్నారు.

వేల సంఖ్యలో సంభవిస్తున్న మరణాలకు బ్రేక్ వేయలేక హైడ్రాక్సీక్లోర్‌క్విన్ ట్యాబ్లెట్ల కోసం భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు.తాజాగా కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది.

కరోనా వ్యాక్సిన్ అందజేత విషయంలో తొలుత అమెరికన్లకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.అమెరికన్లకు అందిన తర్వాతే ఇతర దేశాలకు సహాయం చేయడంపై దృష్టి సారించాలన్నది ఆ ఆర్డర్ సారాంశం.

అవసరమైతే డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్‌ని అమల్లోకి తీసుకొస్తామని ట్రంప్ తెలిపారు.ఈ చట్టం ద్వారా దేశంలోని ప్రైవేట్‌ తయారీ సంస్థలు ఉత్పత్తిని వేగవంతం చేసి అక్కడి ఫెడరల్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించే అధికారం అధ్యక్షుడికి వస్తుంది.

Telugu Corona Vaccine, Defense, Handle Corona, Moderna, Nhs, Warp Speed, Pfizer,

టీకా అభివృద్ధి, సమన్వయం కోసం తాను ప్రారంభించిన ‘ ఆపరేషన్ వార్ప్ స్పీడ్ ’ వల్లే ఇదంతా సాధ్యమైందని ట్రంప్ చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమం కోసం పెట్టిన పెట్టుబడుల వల్లే ఫైజర్, మోడెర్నా టీకాలు అత్యుత్తమంగా నిలిచాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.అతిత్వరలో ఫైజర్‌ టీకాకు.ఆ వెంటనే మోడెర్నా టీకాకు ఎఫ్‌డీఏ అనుమతులిస్తుందని తాను భావిస్తున్నట్లుగా ట్రంప్ వెల్లడించారు.త్వరలోనే అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొననున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 15,593,346కి చేరగా.2,93,445 మంది మరణించారు.

కాగా, ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ తయారు చేసిన కొవిడ్‌ టీకాకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.దీన్ని చరిత్రలోనే అతిపెద్ద టీకా కార్యక్రమంగా అభివర్ణించిన బ్రిటన్, తొలుత 50 ఎన్‌హెచ్‌ఎస్‌ ఆసుపత్రుల్లో పంపిణీకి సిద్ధమైంది.

మొదటి విడతలో భాగంగా.కరోనా ప్రమాదం పొంచి ఉన్న ఆరోగ్య సిబ్బందికి, 80 ఏళ్ల వయసు పైబడినవారితో పాటు అక్కడి కేర్హోమ్ వర్కర్లకు ఈ టీకాను అందించనున్నట్లు పేర్కొంది.

మొదటి డోసు ఇచ్చిన 21 రోజుల తరవాత రెండో డోసు ఇవ్వనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube