పంతం వీడిన ట్రంప్: 95 లక్షల మందిని కాపాడాడుగా..!!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా ఉంటారో ఆయనకే తెలియదు.ప్రెసిడెంట్‌కి అత్యంత సన్నిహితంగా మెలిగే వారికి సైతం ఆయన వైఖరి అంతుపట్టదు.

 Donald Trump Signs 900billion Dollars Covid-19 Relief Package, Covid-19 Relief P-TeluguStop.com

పదవి నుంచి దిగిపోవడానికి రోజులు దగ్గరపడుతుండటంతో ఆయన తనలోని మానవత్వాన్ని బయటకి తీసుకొస్తున్నారు.కొద్దిరోజుల క్రితం 41 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు.

దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు వైట్‌హౌస్‌ను వీడేలోపు తన ఆప్తులు, సొంత పార్టీ వ్యక్తులు, అనుచరులు, కుటుంబసభ్యులకు వరుసగా క్షమాభిక్షలు ఇచ్చుకుంటూ పోతున్నారు.
ఇప్పుడు జనంపై ఆయన కరుణ రసాన్ని చూపిస్తున్నారు.

తాజాగా కరోనాతో అతలాకుతలమైన అమెరికా ఆర్ధిక వ్యవస్థను తిరిగి నిలబెట్టేందుకు తీసుకొచ్చిన ఉద్దీపన బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు.దీంతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం తప్పింది.నిన్న మొన్నటి వరకు తాను సంతకం చేయబోనని బీష్మించుకుని కూర్చొన్న ట్రంప్ తన అలకవీడారు.

Telugu Dollars, Covid Package, Donald Trump, Donaldtrump-Telugu NRI

ఈ బిల్లుపై సంతకం చేయడం ద్వారా వివిథ పథకాల కింద దాదాపు 95 లక్షల మంది అమెరికన్లు లబ్ధి పొందనున్నారు.ఈ పథకం కింద నిరుద్యోగులకు అందుతున్న సహయ సహకారాలు మరో 11 వారాలు కొనసాగనున్నాయి.ఈ పథకాల గడువు వచ్చే శనివారంతో ముగియనుండటంతో అందరిలో ఆందోళన నెలకొంది.

దీంతో కొత్త అధ్యక్షుడు బైడెన్ బాధ్యలు చేపట్టేవరకు ఇబ్బందులు తప్పవని భావించారు.ఈ క్రమంలో ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అమెరికన్లకు ఊరట కల్పించింది.
కాగా, కోవిడ్‌తో నష్టపోయిన అమెరికన్లకు ఆర్థిక సహాయం అందించాలన్న ప్రతిపాదనతో 900 బిలియన్‌ డాలర్ల (సుమారు 66.37 లక్షల కోట్లు) ప్యాకేజీతో కూడిన బిల్లును అమెరికా చట్ట సభలు గతంలోనే ఆమోదించాయి.కానీ ట్రంప్‌ ఎప్పటికప్పుడు దానిని తిరస్కరిస్తూ వచ్చారు.చిన్న వ్యాపారులకు, పౌరులకు 600 డాలర్ల(రూ.44వేలు) ఆర్థిక సహాయం సరిపోదని, దానిని రెండు వేల డాలర్ల (రూ.1.47లక్షలు)కు పెంచాలంటూ తల తిక్క సూచనలిస్తూ వచ్చారు.మరోవైపు అగ్రరాజ్యంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంథోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు.

క్రిస్మస్ సెలవుల తర్వాత దేశంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నారు.సెలవుల్లో ప్రజల ప్రయాణాల వల్ల కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube